అన్వేషించండి

జూన్ 24 రాశిఫలాలు, ఈ శనివారంతో ఈ రాశులవారికి కష్టాలు తొలగిపోతాయి

Rasi Phalalu Today June 24th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జూన్ 24 రాశిఫలాలు

మేష రాశి
ఈ రాశివారు వ్యక్తిగత విజయాలు సాధిస్తారు. ఈరోజు అన్ని రంగాల్లో క్రియాశీలతను కొనసాగించనున్నారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.  పనులను పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. ఈరోజు కొన్ని పెద్ద సమస్యలు దూరమవుతాయి. అన్ని మీకు అనుకూలంగా మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలపై శ్రద్ధ పెడతారు.  ఈ రోజు, ఉద్యోగ వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు.

వృషభ రాశి
ఈ రాశివారు సన్నిహిత సంబంధాలలో శ్రద్ద వహించండి. చురుకుగా ఉండేందుకు ట్రై చేయండి. సున్నితమైన విషయాల్లో తొందరపాటు వద్దు. అహంకారం, మొండితనం మానుకోండి. భావోద్వేగ విషయాలలో సహనం పెంచుకోండి. వృత్తి వ్యాపారాలలో వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటారు. సౌకర్యాలపై ఆసక్తి పెరుగుతుంది. భవన, వాహన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో మరింత సన్నిహితంగా మెలుగుతారు. శారీరక అలంకరణపై శ్రద్ధ చూపుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

మిథున రాశి
ఈరోజు ధైర్యంగా ముందడుగు వేస్తారు.  సోదరులతో సన్నిహితంగా మెలుగుతారు. కొత్త వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్నేహపూర్వకంగా సున్నితంగా ఉంటారు. అందరి పట్ల గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను అనుకూలంగా మలచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈరోజు వాణిజ్యపరమైన అవకాశాలు పెరుగుతాయి.ఆకస్మిక  ప్రయాణం ఉండొచ్చు. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆందోళన తగ్గుతుంది. 

కర్కాటక రాశి
ఈ రోజు సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో మరపురాని క్షణాలను పంచుకుంటారు. కుటుంబ విషయాల పట్ల శ్రద్ద పెరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వస్త్రధారణపై శ్రద్ద, అవగాహన పెరుగుతుంది . జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు తొలగిపోతాయి. పరస్పర సంప్రదింపుల ఉంటాయి. కుటుంబంపై దృష్టి పెట్టాలనే ఆలోచన వస్తుంది. మీ ఆదర్శాలను పాటిస్తూ అందరినీ గౌరవిస్తారు. విలువైన బహుమతులు అందుకుంటారు. బంధువులతో వివాదాలు సమసిపోతాయి.

సింహ రాశి
ఈ రోజు శుభ కార్యాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందరినీ గౌరవిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. వినయంతో, విచక్షణతో, సున్నితత్వంతో వ్యవహరిస్తారు.మీ ప్రసంగం, ప్రవర్తన తో ఇతరుల్ని ప్రభావితం చేస్తారు. కళా నైపుణ్యాలు బలపడతాయి. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. లాభం పెరుగుతుంది. ఇతరుల అంచనాలను అందుకుంటారు. పొదుపుపై ​​శ్రద్ధ పెరుగుతుంది. లక్ష్యంపై దృష్టి సారిస్తారు.

కన్యా రాశి
దూర ప్రాంతాలకి వెళ్లి ఏదైనా కార్యక్రమం పూర్తి చేయాల్సి వస్తే ఓర్పు సహనం అవసరం. అనవసర ఖర్చుల  నియంత్రణను కొనసాగించండి. న్యాయపరమైన విషయాల్లో సహనం , వినయాన్ని పెంచుకోండి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. మీరున్న స్థానంలో  గౌరవం దక్కుతుంది.  నియమాలను పాటించడంలో సౌలభ్యాన్నిఅనుసరించండి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. సన్నిహితులతో కలిసి పాత వివాదాలను  పరిష్కరించుకుంటారు. లావాదేవీల విషయంలో స్పష్టంగా ఉండాలి. ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తత పెరుగుతుంది. బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇస్తారు. దాన ధర్మాల పట్ల ఆసక్తి ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతగా వ్యవహరిస్తారు.

Also Read: వెయ్యి పున్నములు చూడడం అంటే ఏంటి!

తులా రాశి
ఈ రోజు వృత్తి వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ముఖ్యమైన అంశాల్లో వేగం పెంచుతారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పాలనా వ్యవహారాలను యాజమాన్యం చూసుకుంటుంది. నిర్లక్ష్యాన్ని నివారిస్తారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. పరిశ్రమలు, వాణిజ్య రంగం వైపు మొగ్గు చూపుతారు. ఎవరి విమర్శలకు భయపడవద్దు.

వృశ్చిక రాశి
ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. అనుకున్న దానికంటే మెరుగ్గా పని చేస్తారు. వృత్తి నైపుణ్యంపై పట్టుదలతో ముందుకుసాగుతారు. వ్యాపార పురోగతి వలన ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో ఎక్కువ సమయాన్ని గడపాల్సి వస్తుంది. బడ్జెట్‌పై దృష్టి సారిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తారు. కళా నైపుణ్యాలు పెరుగుతాయి. అధికారానికి సంబంధించిన విషయాల్లో వేగం పెంచుతారు. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి
అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు చాలా విషయాలు పరిష్కారమవుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. పెద్దల నుంచి సహకారం అందుతుంది. వ్యక్తిగత ప్రయత్నాలను వేగవంతంచేస్తారు. కొత్త రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. వ్యాపారం ఊపందుకుంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలను వేగవంతం చేసి విజయం సాధిస్తారు. విశ్వాసం పెరుగుతుంది. చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక,  వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆందోళన తగ్గుతుంది.

Also Read:  ఆరుద్ర కార్తె ఆరంభం - ఎర్రటి ఈ పురుగులు కనిపిస్తే వానలు మొదలైనట్టే!

మకర రాశి
మాట, ప్రవర్తనలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటారు. సమతుల్యతతో, సామరస్యంతో ముందుకు సాగుతారు. పనిలో సహనం ప్రదర్శిస్తారు. అవసరమైన పనుల జాబితాను రూపొందించండి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆలోచిస్తూ ఉండండి. సమయం ఆదా  అవుతుంది. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధువుల మాట వినండి.

కుంభ రాశి
ఈరోజు ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపార ప్రణాళికలకు రూపాన్ని ఇస్తారు. లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. చర్చలలో సౌకర్యవంతంగా పాల్గొంటారు. నాయకత్వ సామర్థ్యం బలపడుతుంది. భవన నిర్మాణ పనుల్లో చురుకుదనం ఉంటుంది. కుటుంబంలో సామరస్యాన్నికాపాడుతారు.  ఆత్మీయుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు. భాగస్వామ్య ప్రయత్నం పెరుగుతుంది. పరిశ్రమలు, వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు.  వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మిత్రులు సహకరిస్తారు.

మీన రాశి
వృత్తిపరంగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కఠోర శ్రమతో మీరెంచుకున్న రంగంలో స్థానం సంపాదించుకుంటారు.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. హేతుబద్ధంగా పని చేస్తారు. వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉంటారు. తప్పుదారి పట్టకండి దురాశకు, ప్రలోభాలకు దూరంగా ఉండండి.  రుణాలు తీసుకోవడం మానుకోండి. క్రమశిక్షణ పెంచుకోండి. వినయంగా ఉండండి. తెలివిగా వ్యవహరించండి.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match Highlights IPL 2025  | చెన్నై పై గెలిచి ఆశలు మిగుల్చుకున్న సన్ రైజర్స్CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Embed widget