అన్వేషించండి

జూన్ 16 రాశిఫలాలు, అనుకున్న పనులు పూర్తవకపోవడంతో ఈ రాశివారిని నిరాశ ఆవహిస్తుంది

Rasi Phalalu Today June 16th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Horoscope Today 16th June 2023: జూన్ 16 మీ రాశిఫలితాలు

మేష రాశి

ఈరోజు ఉత్సాహంగా రోజుని ప్రారంభిస్తారు. స్నేహితులు, బంధువుల రాక వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది. బహుమతులు అందుకుని సంతోషంగా ఉంటారు. ఈరోజు ధన లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించగలరు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

వృషభ రాశి 

ఈ రాశివారికి కోపం , చిరాకు వలన పనులకు ఆటంకం. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబ సమస్యల వలన  ఖర్చులు పెరుగుతాయి. అనవసర  ప్రసంగం వలన ఎడిటివారితో వైరం ఏర్పడుతుంది. వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కష్టపడినా ఫలితం దక్కదు. 

మిథున రాశి

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. అవివాహిత లకు వివాహ సూచనలు.ధన లాభం ఉంటుంది.మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. 

Also Read: మీ రాశిప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశగా ఉంటే మంచిది!

కర్కాటక రాశి

కుటుంబ పనుల్లో ఈరోజుబిజీ బిజీ గా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో లబ్ధి పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది.

సింహ రాశి

ఈరోజు ఏ పని చేయాలనే ఆలోచన కలగదు, మందకొడిగా ఉంటుంది. ఇతరుల మీ పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. కొన్ని పనిలో పొరపాట్లు వలన వివాదాలు రావచ్చు. వ్యాపారం లేదా ఉద్యోగంలో సమస్య ఉంటుంది. మీరు కోరుకున్నట్లు శుభ ఫలితాలు లభించవు.ఆధ్యాత్మిక ప్రయాణం వాయిదా పడవచ్చు. అప్రమత్తంగా ఉండాలి.

కన్యా రాశి 

ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి. అవగాహన లోపం వల్ల నష్టం జరగవచ్చు. కుటుంబం, స్నేహితులతో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. వ్యాపారంలో భాగస్వామ్య పనులలో జాగ్రత్త వహించండి.  ఈరోజు ప్రయాణం వాయిదా వేసుకుంటే మీకేమంచిది. మీ ఆహారం,పానీయాలను నియంత్రించండి. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదాలు రావచ్చు.

తులా రాశి 

ఈరోజు మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రజాభిమానం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఏకాంతంలో ఉండటానికే ఇష్టపడతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. 

Also Read: 4 నెలల పాటూ ఈ రాశులవారికి అత్యద్భుతంగా ఉంది!

వృశ్చిక రాశి 

ఈరోజు మీ ఆందోళనలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. మానసిక ఆనందం పొందుతారు. ఉత్సాహం ఉంటుంది. కార్యాలయంలో మరింత బాధ్యతగా వ్యవహరించ వలసి  ఉంటుంది, మీబాధ్యతలను సక్రమంగా  నెరవేర్చగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరగవచ్చు. ఈ రోజు మీకు అత్యంత శుభకరం. పాత విభేదాలు తొలగిపోతాయి. 

ధనుస్సు రాశి

ఈ రోజు ఆస్తి వివాదాల చుట్టిముట్టడం వలన ఆందోళన చెందుతారు. ఆరోగ్యం గురించి చింతతో మానసికంగా బలహీనంగా ఉంటారు. ఉదర సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పనిలో వైఫల్యం కారణంగా మీలో నిరాశ ఆవహిస్తుంది. వ్యాపారంలో నష్టం రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. సన్నిహితులతో చర్చలు ఉపయోగపడేలా ఉంటాయి. ప్రయాణంలో  జాగ్రత్త.

మకర రాశి

సోమరితనం అధికంగా ఉంటుంది. ఏదో తెలియని భయం వలన  ఆందోళన చెందుతారు. టైం తప్పిన ఆహారం,  నిద్ర,  ఉంటుంది. స్నేహితుల వల్ల నష్టం కానీ వారితో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను ఆర్జించగలరు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలను అందుకుంటారు.

కుంభ రాశి 

ఈరోజు మీకు చాలా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీలో ఉత్సాహం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనికిరాని చర్చల్లో సమయాన్ని వృథా చేయకండి. శౌర్యం పెరుగుతుంది, జీవిత భాగస్వామితో సాన్నిహిత్య ఆహ్లాదంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. 

Also Read: జూన్ 17 వటసావిత్రీ వ్రతం, పెళ్లైన వారికి చాలా ముఖ్యం!

మీన రాశి

ఈరోజు శుభదినం. ఆఫీసు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. ఇష్టమైన ఆహారం ఆస్వాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొత్త ఉద్యోగం ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మిత్రులను కలుస్తారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Hyderabad Rains: ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
YS Jagan: ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
Peddapalli MP Serious on Collector: ఎంపీ పనులు చేయొద్దని ఎవరైనా చెప్పారా? పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌పై పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
ఎంపీ పనులు చేయొద్దని ఎవరైనా చెప్పారా? పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌పై పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
Advertisement

వీడియోలు

యూఏఈతో మ్యాచ్ ఆలస్యం.. పాక్‌కి భారీ ఫైన్ వేయబోతున్న ICC?
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మంధాన.. చరిత్ర సృష్టించిన మిస్ క్రికెటర్
పాక్ ఓవర్ యాక్షన్.. యూఏఈతో మ్యాచ్‌కి గంట ఆలస్యంగా టీం
UAE పై గట్టెక్కిన పాక్.. INDIAతో మ్యాచ్ కి డేట్ ఫిక్స్
YS Jagan Assembly Absence | పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Hyderabad Rains: ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
YS Jagan: ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
Peddapalli MP Serious on Collector: ఎంపీ పనులు చేయొద్దని ఎవరైనా చెప్పారా? పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌పై పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
ఎంపీ పనులు చేయొద్దని ఎవరైనా చెప్పారా? పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌పై పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
Miriyalaguda MLA: కుమారుడి పెళ్లి విందు ఖర్చుతో రైతులకు ఉచితంగా యూరియా- మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆదర్శం 
కుమారుడి పెళ్లి విందు ఖర్చుతో రైతులకు ఉచితంగా యూరియా- మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆదర్శం 
OG Updates: పొలిటికల్ ఎనిమీస్... పవర్ ఫుల్ రోల్స్ - పవన్ 'ఓజీ'లో ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్
పొలిటికల్ ఎనిమీస్... పవర్ ఫుల్ రోల్స్ - పవన్ 'ఓజీ'లో ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్
Deepika Padukone : దీపికా బయలుదేరమ్మా ఇక అని ఎందుకంటున్నారు? మొన్న స్పిరిట్, ఇప్పుడు కల్కి  2898 AD సీక్వెల్..మరి అట్లీ మూవీ?
దీపికా బయలుదేరమ్మా ఇక అని ఎందుకంటున్నారు? మొన్న స్పిరిట్, ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్..మరి అట్లీ మూవీ?
Rahul Gandhi Press Meet: ఓట్‌ చోరీ అంశంలో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మరిన్ని విమర్శలు, హైడ్రోజన్ బాంబు ముందుందని ప్రకటన
ఓట్‌ చోరీ అంశంలో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ మరిన్ని విమర్శలు, హైడ్రోజన్ బాంబు ముందుందని ప్రకటన
Embed widget