జూలై 6 రాశిఫలాలు, ఈ రాశులవారు జీవితంలో ఎదురయ్యే సానుకూల మార్పులను అంగీకరించాలి!
Rasi Phalalu Today June 6th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Horoscope Today (జూలై 6 రాశిఫలాలు)
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. మీ మనస్సు ఆధ్యాత్మిక కార్యకలాపాలు వైపు మొగ్గు చూపుతుంది. మీరు మీ శత్రువుల గూర్చి ఎక్కువగా ఆలోచించకండి. గురువు పట్ల విధేయత కలిగి ఉండాలి. మీ మనసులో నూతన ఆలోచనలకు ఆస్కారముంది. స్నేహితులుగా నటిస్తూ చెడు చేసే వారిని గుర్తించండి.
వృషభ రాశి
ఈ రాశి వారు మీ ప్రణాళికలను పూర్తిగా అమలు చేయగలుగుతారు...ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విలాస వస్తువులు కొంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయి. అవివాహితులకు వివాహ సూచనలు మెండుగా ఉన్నాయి . ఈ రోజు ఈ రాశి వారు అన్ని విషయాల్లో ప్రయోజనం పొందుతారు .
మిథున రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో వాతావరణంమీకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ ఆలోచనల పట్ల ఆకర్షితులవుతారు. ఊపిరి సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు.ప్రభుత్వ ఆర్డర్‌లను పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పరిష్కారం కానీ వివాదం ఈ రోజుతో సమసిపోతుంది
Also Read: వీధిపోటు ఈ దిశగా ఉంటే ఆస్తి నష్టం, కోర్టు కేసులు - ఆ 4 దిశల్లో ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం!
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి యువతీ , యువకులకు అనుకూలమైన రోజు. మీరు ఎంచుకున్న రంగం లో సత్తా చాటు తారు. ఈ రోజు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల చదువుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సంపద, శ్రేయస్సు రెండూ వృద్ధి చెందుతుంది. నూతన పనులు ప్రారంభించే అవకాశం ఉంది. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి.
సింహ రాశి
ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల అస్వస్థతగా ఉండవచ్చు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వ్యాపార రంగం లో ఉన్నవారు లాభాన్ని పొందుతారు. వ్యక్తిగత చర్చలు చేయ కుండా కుటుంబ సభ్యులతో చర్చండి.
కన్యా రాశి
ఈ రాశి వారు కొత్త కొత్త ప్రణాళికలతో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశముంది. మీరు ఓర్పు, సహనం తో పని చేయాలి. మీ రోజువారీ దినచర్య క్రమబద్ధంగా, క్రమశిక్షణతో అమలు చేయండి. వ్యాపారంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతుంది.
తులా రాశి
సంఘంలో మీ గౌరవం తగ్గుతుంది. మీ విజయాలను మీ చుట్టు పక్కల వారితో పంచుకోవద్దు. వాతావరణం లో వచ్చిన మార్పుల వల్ల అలర్జీలు, కొన్ని శారీరక సమస్యలు ఉంటాయి. ఆహార నియమాలు పాటించండి. అజాగ్రత్తగా ఉండకండి. మీరు మీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ వాహనం( టూ వీలర్ or ఫోర్ వీలర్) ఏ రంగు ఉండాలో తెలుసా!
వృశ్చిక రాశి
ఈ రోజు మీ జీవితం లో ఎదురయ్యే సానుకూల మార్పులను అంగీకరించండి. భార్యాభర్తల మధ్య సహకారం ఉంటుంది . ఒకరితో ఒకరు ప్రేమగా మసలుతారు. మరు సాధించిన విజయాలను అందరూ గుర్తిస్తారు. మీ విజయంపై ప్రతిచోటా చర్చ జరుగుతుంది. సంపద శ్రేయస్సు మరింత వృద్ధి లోకి వస్తాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త కొత్త కళలనునేర్చుకుని నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ నిర్వహణ సామర్థ్యం వలన అందరి మన్ననలు పొందుతారు. స్టాక్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. పాత మిత్రులను కలిసే అవకాశముంది.
మకర రాశి
ఈ రోజు ఎదురయ్యే కొన్ని అపార్థాల కారణంగా, కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి. యోగా , ధ్యానాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకొని ఒత్తిడిని అధిగమించండి. మీరు అహంకారానికి దూరంగా ఉండాలి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి.
కుంభ రాశి
ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజు వివాదాలు సమసిపోతాయి. గృహ సమస్యలు పరిష్కారమవుతాయి. మార్కెటింగ్ సంబంధిత వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. మీ మేధస్సు తో పనులు సమర్థ వంతంగా పూర్తి చేస్తారు. హక్కులతోపాటు బాధ్యతలు పెరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిశోధన రంగం లో ఉన్నవారికి పనులలో ఆటంకాలు ఏర్పడి జాప్యం జరుగుతుంది. ట్రాఫిక్ నియమాలను జాగ్రత్తగా పాటించండి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి.దీని కారణంగా కొంత ఇబ్బంది ఉంటుంది