News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 18 రాశిఫలాలు, ఈ రాశులవారు ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

Rasi Phalalu Today 18th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 18 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. స్నేహితులతో సామాజిక సేవలో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చవుతుంది కానీ లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిబాగానే ఉంటుంది. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. ఆరోగ్యం పరంగా సమయం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు మంచిరోజు. కొత్త పనులను విజయవంతంగా నిర్వహించగలుగుతారు. అధికారుల ఆశీస్సులు మీపై ఉంటాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహస్థ జీవితంలో సంతోషం ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీరు వ్యాపారంలో భాగస్వామ్య పని నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ జీవితం సంతృప్తితో నిండి ఉంటుంది. మీరు తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉంటారు.

మిథున రాశి

కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా మీ పనిలో జాప్యం జరుగుతుంది. ఉత్సాహం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.  ఉద్యోగంలో అధికారుల ప్రతికూల ప్రవర్తన వల్ల మీరు బాధపడతారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ముఖ్యమైన పని లేదా నిర్ణయాన్ని వాయిదా వేయడం సముచితం. పిల్లలతో విభేదాలు ఉంటాయి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుటుంబంతో కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఈ గుణాలున్న భర్త ఉంటే భార్య అదృష్టవంతురాలు

కర్కాటక రాశి

మానసికంగా ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు అనారోగ్యంగా అనిపిస్తుంది. మీ మనస్సు పనిలో నిమగ్నమై ఉండదు. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి. కొత్త పరిచయాలు కూడా ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండవు. ప్రభుత్వ వ్యతిరేక పోకడలకు దూరంగా ఉండటం మేలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి

వైవాహిక జీవితంలో వివాదాలున్నాయి జాగ్రత్త. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపారంలో మీ భాగస్వామితో ఓపికగా ఉండండి. వీలైతే అనవసరమైన చర్చలు లేదా వివాదాలలోకి అడుగేయవద్దు. కోర్టు పనుల్లో జాప్యం ఉంటుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవడంమంచిది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: ఏప్రిల్ 17 - 23 వారఫలాలు, ఈ వారం ఈ రాశులవారికి ప్రమాదం పొంచిఉంది జాగ్రత్తపడాలి

కన్యా రాశి

ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ పని సులభంగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగంలో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది.సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అత్తమామల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. పని పూర్తయిన తర్వాత మీరు కీర్తిని పొందుతారు. ఖర్చులు అధికం కావచ్చు.

తులా రాశి

మీరు ఈ రోజు పెద్ద ప్రయోజనం పొందుతారు. ఆలోచనలు రిచ్ గా ఉంటాయి. ప్రసంగంలోని మాధుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది ... ఇతర వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగిస్తుంది. మీరు రాజకీయ చర్చలలో కూడా ప్రభావం చూపగలరు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కెరీర్ విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. కడుపు సంబంధిత ఫిర్యాదు ఉండవచ్చు..ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాహిత్యంపై ఆసక్తి కలగి ఉంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి

వృశ్చిక రాశి

ఈ రోజు  ఈరాశివారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ సలహా ఇవ్వకండి. ఇది మీపై విమర్శలకు దారితీయవచ్చు. మనసులోంచి ప్రతికూల ఆలోచనలను తొలగించండి. బంధువులతో విబేధాలు ఏర్పడవచ్చు. ఆకస్మికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు ఎలాంటి పత్రాలకు సంబంధించిన పనులు చేయకండి. గృహ జీవితంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీరు ఆలోచనాత్మకంగా ప్రవర్తించాలి.

ధనుస్సు రాశి

ఈ రాశివారి ఆరోగ్యం బావుంటుంది.  కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి సరైన సమయం ముందుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితంలో ఆనందం నిలిచి ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. కుటుంబ సమస్య గురించి జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాత అర్థవంతమైన పరిష్కారం కనుక్కుంటారు. ఈ రోజు మీ పనులన్నీ సజావుగా సాగుతాయి.

మకర రాశి

ఈ రోజు ఈరాశివారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీ, బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలహ సూచనలున్నాయి. మాటతూలకండి. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. శారీరక నొప్పి ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలను వదలండి

కుంభ రాశి

ఈ రాశివారి ఆరోగ్యం బావుంటుంది. ప్రారంభించిన పనులన్నీ ఉత్సాహంగా చేయగలుగుతారు.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  బంధు మిత్రులతో కలిసి రుచికరమైన వంటకాలను ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీరు ఆలోచనా శక్తి, ఆధ్యాత్మిక శక్తి ప్రభావాన్ని తెలుసుకోగలుగుతారు. కార్యాలయంలో అధిక పని కారణంగా ఒత్తిడికి లోనవుతారు.

మీన రాశి

ఈ రాశివారు ఈరోజు...ఒకరి మాటల్లో కూరుకుపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు. పిల్లల సమస్య మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.  మతపరమైన పనుల కోసంఖర్చులు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు లేదా కోర్టు వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పని దెబ్బతింటుంది.

Published at : 18 Apr 2023 05:31 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today April 18th Horoscope Horoscope for 18th April 18th APril Horoscope 18th April Astrology

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా