News
News
X

Horoscope Today 13th February 2023: ఫిబ్రవరి 13, రాశి ఫలాలు - ఈ రాశులవారికి ఆర్థిక లాభం, ప్రేమ ఫలిస్తుంది!

Rasi Phalalu Today 13th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి

వ్యాపారంలో స్వల్ప మార్పులు జరగొచ్చు. అది మీ మనసుకు చాలా సంతోషాన్నిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అధిక వ్యయం మీ మనస్సును ఇబ్బంది పెడుతుంది. ఇష్టం లేకపోయినా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అధికారుల సహకారం లభిస్తుంది. మీరు మీ లవర్‌తో సంతోషకరమైన క్షణాలను గడిపే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేయవచ్చు. సృజనాత్మక, కళాత్మక రంగాలలో కూడా వృద్ధి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు మీకు డబ్బు రావచ్చు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిది. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోండి. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. మీకు లభించాల్సిన ధనం చేతికి అందుతుంది. ఉద్యోగస్తులు పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అధికారుల సహకారం లభిస్తుంది. నిన్న మీరు పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తారు. అందరూ సంతోషంగా కనిపిస్తారు. మీ మనసుకు శాంతి కలుగుతుంది. విద్యార్థులు పోటీలో పాల్గొని విజయం సాధిస్తారు.

మిధున రాశి

వ్యాపారస్తులు నిలిచిపోయిన పనులను నేడు పునఃప్రారంభించే అవకాశం లభిస్తుంది. కొత్త వ్యాపార ప్రాజెక్టుల వైపు కూడా వెళ్లవచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటి పెద్దల ఆశీస్సులతో కొత్త పనిని ప్రారంభించగలరు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. 

కర్కాటక రాశి 

విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మనశ్శాంతి కోసం ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ కొంత సమయం గడుపుతారు. చాలా రోజులుగా నిలిచిపోయిన మీ పని పూర్తవుతుంది. కోర్టు కేసులో సానుకూల తీర్పు వెలువడే అవకాశం ఉంది. స్థిరాస్తి రంగంలో లాభాలు పొందుతారు. మీకు పాత కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. అందులో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పదోన్నతి కూడా పెరుగుతుంది. ఉద్యోగ బదిలీ విషయంలో మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తారు. తద్వారా వ్యాపారం ముందుకు సాగుతుంది. విద్యార్ధులు విద్య కోసం ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. 

సింహ రాశి

సోదరుల వివాహాలలో వచ్చే కష్టాలు నేటితో తీరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మనుషులు వస్తూ పోతూ ఉంటారు. రాజకీయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మార్పులు జరుగుతాయి. వైవాహిక జీవితంలో టెన్షన్ కనిపిస్తుంది. దాని కారణంగా మీ మనస్సు కలత చెందుతుంది. పోటీ పరీక్షల్లో సన్నద్ధత కోసం విద్యార్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సామాజిక రంగాలలో పని చేసే వారికి గౌరవం పెరుగుతుంది.  అత్తమామల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

కన్య రాశి 

ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రేమికులకు ఈ రోజు కలిసివస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో నిలిచిపోయిన ప్రణాళికలను పూర్తిచేయడంలో బిజీగా ఉంటారు. మీరు స్నేహితుల ద్వారా ఆదాయ అవకాశాలను పొందుతారు. దాని నుంచి మీరు లాభం పొందడం ద్వారా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తారు. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా సంతోషంగా ఉంటారు. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యా కార్యాలలో విజయం సాధిస్తారు. మీకు కొత్త జాబ్ ఆఫర్ కూడా వస్తుంది, అందులో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది.

తులా రాశి

మీ ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు పై అధికారుల మద్దతు పొందుతారు. మీ ఆగిపోయిన డబ్బు కూడా మంచి వ్యక్తి వల్ల అందుతుంది. విద్యారంగంలో పురోగతి ఉంటుంది. మీరు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడికి పూర్తి ప్రయోజనం కూడా పొందుతారు. పిల్లల ద్వారా శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. మీరు ఆదాయ అవకాశాలను పొందుతారు. మీరు కొత్త వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. 

వృశ్చిక రాశి

నిలిచిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు. ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. శాంతి, సహనంతో అన్ని విషయాలను పరిష్కరిస్తారు. మీ వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది. పూర్వీకుల వ్యాపారం చేసే వారు రేపు వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పూజలు, పారాయణం, భజన, కీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు మీ తండ్రి ఆశీర్వాదం తీసుకుని బయటకు వెళితే, ధనలాభం కలుగుతుంది. మీకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందుతారు.

ధనుస్సు రాశి

ఉద్యోగస్తులు తమ పై అధికారుల నుంచి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. దీని వలన చాలా సంతోషంగా ఉంటారు. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయగలుగుతారు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇల్లు కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. 

మకర రాశి

వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందిన తరువాత వ్యాపారం చేసే వ్యక్తులు రేపు చాలా సంతోషంగా కనిపిస్తారు. మీ ప్రేమ మరియు పిల్లల నుండి కొంత దూరం ఉంటుంది, దాని కారణంగా మీ మనస్సు విచారంగా ఉంటుంది. మీ వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి స్థానం మార్పు ఉండవచ్చు. మీరు మీ స్నేహితుల నుంచి లాభాలను పొందుతారు. మీరు ఎవరి సలహా మేరకు ఏ పనీ చేయకూడదు. లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. మీ ప్రత్యర్థులు మీకు చెడు చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నారు. కానీ తెలివితేటల వల్ల మీరు వారిని ఎదుర్కోగలరు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు రేపు లాభాలను పొందుతారు. 

కుంభ రాశి

మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరు కొత్త పద్ధతులను కూడా అవలంబిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభించవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.స్నేహితుల ద్వారా ఆదాయ వనరులను పొందుతారు. మీరు వారి నుంచి లాభం పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ రోజు మంచిది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆన్‌లైన్‌లో పని చేసే వ్యక్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మీన రాశి

వ్యాపారం సాఫీగా సాగుతుంది. మనస్సును సంతోషపరుస్తుంది. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు వారు కోరుకున్నట్లుగా మంచి సంబంధం రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు.

Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

Published at : 13 Feb 2023 02:03 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today Horoscope for Feb 13th Feb 13th Horoscope 13th feb Astrology 13th feb Horoscope ఫిబ్రవరి 13 రాశిఫలాలు

సంబంధిత కథనాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!

Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

Sri Sobhakritu Nama Samvatsaram: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

Ugadi 2023: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?