Horoscope Today 12 June 2024: ఈ 3 రాశులవారు కోపం కారణంగా తీవ్రంగా నష్టపోతారు - మీన రాశివారు శత్రువుల కారణంగా మరింత బలపడతారు
Horoscope Prediction 12th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![Horoscope Today 12 June 2024: ఈ 3 రాశులవారు కోపం కారణంగా తీవ్రంగా నష్టపోతారు - మీన రాశివారు శత్రువుల కారణంగా మరింత బలపడతారు Horoscope Today 12th june 2024 Astrological prediction for june 12 2024 rasi phalalu for gemini leo Scorpio and other zodiac signs in telugu Horoscope Today 12 June 2024: ఈ 3 రాశులవారు కోపం కారణంగా తీవ్రంగా నష్టపోతారు - మీన రాశివారు శత్రువుల కారణంగా మరింత బలపడతారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/7cb587c8030e324cf9b02ff656962a151718115710373217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజు మీకు బలహీనమైన రోజు కావొచ్చు. పొట్టకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనవసరమైన కోపం వల్ల హాని కలుగుతుంది. ప్రేమ సంబంధాలకు ఈ రోజు అనుకూలమైనది కాదు. మీ ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి. మీ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి
వృషభ రాశి
ఈ రోజు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు ఈరోజు గృహోపకరణాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. క్షుద్ర శాస్త్రాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి రోజు అనుకూలమైనది కాదు. ఉత్సాహం తగ్గవచ్చు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ బాధ్యతలు పెరిగినప్పటికీ ఇంకా ఉత్సాహంగా ఉంటారు. ఇంటి వాస్తులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మీరు మీ భవిష్యత్తును చాలా ఆలోచనాత్మకంగా ప్లాన్ చేసుకుంటారు.
Also Read: చంద్రబాబు కాన్వాయ్ నెంబర్ 393 - ఈ నెంబర్ వెనుక ఇంత పవర్ ఉందా!
కర్కాటక రాశి
ఈ రోజు సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆవేశంగా మాట్లాడొద్దు. ఈ రోజు మీరు చేపట్టే పనులు నిదానంగా సాగుతాయి. చాలా ఓపిక ఉండాలి. మీరు ప్రయాణాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి...
సింహ రాశి
మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా ఉంటారు. ఇతరుల గొడవల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. పెట్టుబడి విషయంలో తొందరపడకండి.
కన్యా రాశి
ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహం తగ్గుతుంది. కోపం కారణంగా నష్టపోవచ్చు. మీ చుట్టూ ఉండేవారు చాలామంది మిమ్మల్ని వినియోగించుకుని మోసం చేస్తారు..జాగ్ర్తతగా ఉండండి. వ్యాపారంలో ఇప్పట్లో నూతన ప్రయోగాలు చేయవద్దు.
తులా రాశి
ఈ రోజు ఆధ్యాత్మిక ఆలోచనల్లో ఉంటారు. ఉద్యోగులకు లాభదాయకమైన అవకాశాలుంటాయి. నిరుద్యోగులు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ముఖ్యమైన పనికోసం డబ్బు ఖర్చుచేయాల్సి రావొచ్చు.
వృశ్చిక రాశి
ఈ రోజు వ్యాపారంలో వృద్ధి అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల నుంచి చాలా మద్దతు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధించగలరు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
మీకు ఈ రోజు పనిపట్ల బద్ధకంగా అనిపిస్తుంది. ఉద్యోగులకు తమ పనికన్నా ఇతరుల పనిపట్ల ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో గొడవలు పడే పరిస్థితి రావొచ్చు. వ్యాపారులు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బావుంటుంది..
మకర రాశి
ఈ రోజు అనారోగ్య సూచనలున్నాయి. అనవసర పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. స్వచ్ఛత పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది..
కుంభ రాశి
ఈ రోజు ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి మెప్పు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది కానీ వారు చెప్పిన సలహాలు పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది.
Also Read: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !
మీన రాశి
ఈ రాశివారు శత్రువుల కారణంగా మరింత బలపడతారు. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొద్దు. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. అప్పులు చేయొద్దు. ఉద్యోగులకు కొన్ని చికాకులు తప్పవు. మాటలో మాధుర్యం తగ్గనీయొద్దు...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)