By: RAMA | Updated at : 06 Feb 2023 04:51 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 06th February 2023 (Image Credit: Freepik)
Horoscope Today 06th February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం
మేష రాశి
ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయడానికి ఒకరి నుంచి ప్రేరణ పొందుతారు. కొత్తగా ఏం చేసినా అందులో మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మారుతున్న వాతావరణాన్ని ఆస్వాదించండి. ఈ రోజు మీరు పాత స్నేహితుడిని కలుస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీ మదిలో కొత్త ఆలోచనలు వస్తాయి. మీ దృఢ సంకల్పంతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. కలలు సాకారం అవుతాయి. కానీ మీ మనస్సులో ఏదో ఆందోళన ఉంటుంది. భవిష్యత్ వ్యాపార ప్రణాళికలకు పూర్తిగా ప్లాన్ చేసుకుంటారు.
మిథున రాశి
ఏదో సందిగ్ధం మిమ్మల్ని వెంటాడుతుంది..గందరగోళంలో చిక్కుకుంటారు. ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతారు. కుటుంబ కార్యక్రమంలో మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు
కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది.విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సైన్స్ విద్యార్థులు పరిశోధనలకు సంబంధించి ఫలితం పొందుతారు. ఆరోగ్యంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి.
సింహ రాశి
ఈ రోజు కుటుంబ సమస్యల వల్ల మనసు పక్కదారి పడుతుంది. ఆర్థిక పరంగా మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు శారీరకంగా మరియు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కన్యా రాశి
ఈ రోజు మీలో కొంతమంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒత్తిడికి, ఆందోళనకు గురి చేస్తుంది. కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక వ్యవహారాలను మీరే చూసుకోండి.. వేరేవారికి అప్పగించడం వల్ల ఇబ్బందులు మొదలవుతాయి.
Also Read: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి
తులా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి.సామాజిక సేవ పట్ల ఆసక్తి చూపుతారు. సామాజిక సంస్థను ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచి రోజు. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు సంతోషకరమైన రోజు. భౌతిక సాధనాలు కొనుగోలు చేస్తారు. రొమాంటిక్ రిలేషన్ షిప్స్ లో సక్సెస్ అవుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీ జీవితంలో ఉండబోతోంది.
ధనుస్సు రాశి
మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు గుర్తించండి. ఆకస్మిక బాధ్యతలు మీ రోజువారీ ప్రణాళికకు ఆటంకం కలిగిస్తాయి.ఖర్చులు పెరిగినప్పటికీ దానికి తగిన ఆదాయం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
మకర రాశి
ఈ రోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి రోజు. కొత్త వ్యాపార ఒప్పందం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ రోజు మీరు శుభవార్త వింటారు.
కుంభ రాశి
ఈ రోజు పని పట్ల కుతూహలం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. కుటుంబంలో కలహాలు, విభేదాలు ఉండవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. కొన్ని విషయాల్లో ఇరుగుపొరుగువారితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
మీన రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబ మొత్తానికి శ్రేయస్సుని కలిగించే ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు
Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే
Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!
Political Horoscope: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!
ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది
Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు