అన్వేషించండి

Horoscope Rashifal 25 February 2024: ఈ రాశులవారికి సంపద, సంతోషం - ఫిబ్రవరి 25 ఆదివారం రాశిఫలాలు

Daily horoscope for February 25, 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope - ఫిబ్రవరి 25 ఆదివారం రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

కుటుంబం , స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. రాజకీయ నాయకులకు శుభసమయం. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. సంపద, సంతోషం పెరుగుతుంది. కళలు, సంగీతం పట్ల ఆశక్తి పెరుగుతుంది. కుటుంబంతో కలసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఏదో విషయంలో బాధపడతారు..సహనం పాటించండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్‌లకు బాధ్యత వహించడంలో మీరు నమ్మకంగా కనిపిస్తారు. అదనపు ఖర్చులు ఉంటాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మిత్రుల సహకారంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి 

Also Read: ఈ వారం ఈ రాశులవారు ఏం అనుకున్నా నెరవేరుతాయి, ఫిబ్రవరి 26 to మార్చి 03 వారఫలాలు

మిథున రాశి (Gemini Horoscope Today) 

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతికి అనేక అవకాశాలు ఉన్నాయి కానీ   పనిలో కూడా అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ధన ప్రవాహం పెరుగుతుంది, కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆశ, నిరాశ   భావాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రచన ,మేధోపరమైన పని ద్వారా ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.  ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ప్రయాణం ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం  ఉంటుంది.  

సింహ రాశి (Leo Horoscope Today)

వృత్తి జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు అదనపు పని బాధ్యతలను పొందుతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వృత్తి జీవితంలో  కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.

Also Read: రోజూ ఉదయాన్నే గాయత్రి మంత్రం పఠిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

మనసు ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో  ఉంటారు.  ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వస్తుసౌఖ్యాలు, సంపద  పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ జీవిత భాగస్వామితో  విభేదాలు ఉండవచ్చు . అధిక కోపాన్ని తగ్గించుకోవాలి. కుచుంబంలో సమస్యలను తెలివిగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. మీ మాటల్ని అదుపులో పెట్టుకోవాలి.  తొందరపాటు నిర్ణయం తీసుకోకండి.

తులా రాశి (Libra Horoscope Today) 

జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది,   పనిలో సవాళ్లు పెరుగుతాయి.  స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇంట్లో వాదనలకు దూరంగా ఉండండి. దినచర్య అస్తవ్యస్తంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించండి.  ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు. వ్యాపారం విస్తరణకు అవకాశాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మాటలో సౌమ్యత ఉంటుంది, కానీ తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది.  అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి.

Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

 మేధోపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.   కార్యాలయంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ  వద్దు. మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసం లేమిగా భావిస్తారు. కోపం తగ్గించుకోండి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. కష్టపడి  అంకితభావంతో చేసే పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది.

మకర రాశి (Capricorn Horoscope Today)

మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది కానీ మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సమస్యల వల్ల మనస్సు   ఆందోళన చెందుతుంది. ఈరోజు పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది.  భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  మీ జీవిత భాగస్వామితో ఉన్న విబేధాలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. 

Also Read: ఒకే రాశిలో సూర్యుడు, శని, బుధుడు - ఈ రాశులవారికి కలిసొచ్చే సమయం!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.  విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. - న్యాయపరమైన విషయాలలో విజయం ఉంటుంది.

మీన రాశి (Pisces Horoscope Today) 

 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ  అవసరం. మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండాలనే ఆలోచన నుంచి బయటకు రండి. సవాళ్లను ఎదిరించండి కానీ భయపడవద్దు. ఉద్యోగులు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండి పనిపై దృష్టి సారిస్తారు.

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Embed widget