Today Horoscope in Telugu: మార్చి 31 రాశి ఫలాలు - ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు, జర భద్రం
Horoscope Prediction 31st March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for March 31st 2024:
మేష రాశి
ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ప్రాముఖ్యత పెరుగుతుంది. కొన్ని అనుకోని సంఘటలు మీకు ఆశ్యర్యం కలిగిస్తాయి. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వెహికిల్స్ కోనే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అభివృద్ది జరుగుతుంది. బంధు మిత్రులలో మీకు ఆదరణ పెరుగుతుంది.
వృషభ రాశి
ఈరోజు ఈ రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో విబేధాలు వస్తాయి. కొత్త బిజినెస్‌లు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగులు అధిక ఒత్తిడికి లోనవుతారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు కూడా నిదానంగా జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేస్తున్న పనులలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కలిసి వస్తుంది. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈరోజు పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. కొత్త పరిచయాలతో విలువైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. వృత్తి వ్యాపారాలలో మంచి జరిగే అవకాశం ఉంది.
కన్య రాశి
ఈ రాశి వారు ఇవాళ ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అప్పులు ఇచ్చిన బంధు మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆస్థి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తీవ్రం అవుతాయి.
తులా రాశి
ఈ రాశి వారికి ఇవాళ అన్ని సమస్యలే వేధిస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. స్నేహితుల వలన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు జరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఇవాళ ఉద్యోగ సంబంధమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రుణాలు అందివస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. పనులలో అవరోధాలు తొలగిపోయి ఆర్థికంగా కలిసొస్తుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా ఉంటాయి.
ధనస్సు రాశి
ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వ్యాపారస్తులు మాత్రం వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మకర రాశి
ఈరాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. స్థిరాస్థి వ్యవహారాలకు పరిష్కారం దొరుకుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ధనం వృథాగా ఖర్చవుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగులు పనులలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వ్యవహారాలలో నిరాశే ఎదురవుతుంది.
మీన రాశి
ఈరాశి వారు ఈరోజు నూతన పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పాత వివాదాలు సమసిపోతాయి.
Note: ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ALSO READ: సిద్ధార్థ్, అదితి పెళ్లి చేసుకున్న ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా!