అన్వేషించండి

నవంబరు 16 to 30..ఈ నెల సెకెండాఫ్ ఈ రాశులవారికి ఊహించని విధంగా ఉంటుంది!

Horoscope 16 to 30 November 2024: నవంబరు నెల 15 రోజులు గడిచిపోయింది... మరో 15 రోజులు ఉంది. ఈ రెండు వారాల్లో ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి....

Horoscope in Next 15 Days 16 to 30 November 2024 - నవంబరు 16 to 30 రాశిఫలాలు

మేష రాశి  (Aries Horoscope 16 to 30 November 2024)

నవంబరు 16 నుంచి నెలాఖరు వరకూ మేష రాశి వారికి వ్యాపారం బాగుంటుంది. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం పొందుతారు. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణం చేయవచ్చు. అనుకోని అతిథులు వస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు.

వృషభ రాశి (Taurus Horoscope 16 to 30 November 2024)

ఈ 15 రోజులు వృషభ రాశి వారికి  మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పనుల్లో నష్టం రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. 

మిథున రాశి  (Gemini Horoscope 16 to 30 November 2024)

నవంబరు సెకెండాఫ్ మిథున రాశివారి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక కొత్త ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ డిస్ట్రబ్ అవుతుంది. కొత్త వనరుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తప్పుడు చర్యలకు దూరంగా ఉండండి. మీరు న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహాలు స్వీకరించండి

Also Read: మకరం లోకి శుక్రుడు.. డిసెంబర్ లో ఈ 3 రాశులవారికి ఐశ్వర్యం, ఈ 5 రాశులవారికి మనోవేదన

కర్కాటక రాశి (Cancer Horoscope 16 to 30 November 2024)

నవంబరు మూడు నాలుగు వారాల్లో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మాటతీరు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో కొన్నాళ్లుగా ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఎవరి మాటలు తొందరగా నమ్మేయవద్దు

సింహ రాశి (Leo Horoscope 16 to 30 November 2024)

నవంబరు 16 నుంచి నెలాఖరు వరకూ సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ 15 రోజుల్లో ఓ శుభవార్త వింటారు.విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రేమికులు గుడ్ న్యూస్ వింటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 

కన్యా రాశి  (Virgo Horoscope 16 to 30 November 2024)

కన్యారాశివారికి నవంబర్ సెకండాఫ్ కలిసొస్తుంది. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మీ మాటలు చాలామందిపై ప్రభావం చూపిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి లాభపడతారు. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు. వృద్ధులకు సేవ చేయండి. 

Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

తులా రాశి  (Libra Horoscope 16 to 30 November 2024)

నవంబరు 16 నుంచి 30  మధ్యలో తులా రాశివారు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్త వ్యక్తులను కలుస్తారు.  ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక సంబంధిత సమస్యలు దూరమవుతాయి.  కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio Horoscope 16 to 30 November 2024)

నవంబరు సెకెండాఫ్ లో వృశ్చిక రాశికి చెందిన వారు క్రీడలలో విజయం సాధిస్తారు.  మీ సంపద పెరుగుతుంది. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు.  వృద్ధులు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. రాజకీయ వ్యక్తులు పెద్ద పదవులు పొందగలరు. ఉద్యోగులకు శుభసమయం.
 
ధనుస్సు రాశి (Sagittarius Horoscope 16 to 30 November 2024)

నవంబరు ఆఖరి రెండు వారాలు ధనస్సు రాశివారు బంపర్ ఆఫర్ పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. నూతన ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ఆశలు ఫలిస్తాయి. తెలియని వ్యక్తులతో ఎక్కువ సన్నిహితంగా ఉండకండి.  లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి 

Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!

మకర రాశి (Capricorn Horoscope 16 to 30 November 2024)

మకర రాశివారు కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలకు నవంబరు సెకెండాఫ్ లో పరిష్కారాలు కనుగొంటారు. కెరీర్‌లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. యువతకు మేలు జరుగుతుంది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. 

కుంభ రాశి (Aquarius Horoscope 16 to 30 November 2024)
 
నవంబరు సెకెండాఫ్ లో కుంభ రాశివారు రహస్య , ఆధ్యాత్మిక శాస్త్రాల వైపు మొగ్గు చూపిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించగలరు. కొన్ని పనులకు సంబంధించి కొనసాగుతున్న ఆటంకాలు తొలగిపోవచ్చు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మీన రాశి   (Pisces Horoscope 16 to 30 November 2024)

నవంబరు 16 నుంచి 30 మధ్యలో మీన రాశివారు బంధువుల ఇళ్లను సందర్శిస్తారు. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు.   

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget