అన్వేషించండి

Venus Transit In Capricorn 2024: మకరం లోకి శుక్రుడు.. డిసెంబర్ లో ఈ 3 రాశులవారికి ఐశ్వర్యం, ఈ 5 రాశులవారికి మనోవేదన

Shukra Gochar 2024: ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉన్న శుక్రుడు డిసెంబరు 02న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెల మొత్తం ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో చూద్దాం..

 Venus Transit in Capricorn 02 December 2024 :డిసెంబరు 02 నుంచి నెలాఖరు వరకూ మకర రాశిలో సంచరిస్తాడు శుక్రుడు. శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. జాతకంలో కీలక గ్రహాలంటే శని, బృహస్పతి, శుక్రుడు అనే చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. శుక్ర సంచారం బావుంటే శని ప్రభావం ఉన్నప్పటికీ ఐశ్వర్యానికి, విలాసాలకు లోటుండదు. మకర రాశిలో శుక్రుడి సంచారం మకరం, మిథునం, సింహం, తులారాశి వారికి శుభాన్నిస్తే..  మేషం, వృషభం, ధనుస్సు సహా ఈ రాశులవారికి కొన్ని ఇబ్బందులు తెస్తోంది..

మేష రాశి

ఈ రాశి వారికి మనోవేదన ఉంటుంది. నిరుత్సాహం వెంటాడుతుంది. అనవసర కోపం తెచ్చుకోవద్దు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. 

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మాటల్లో సమతుల్యత పాటించడం ముఖ్యం. వ్యాపారంలో లాభాలుంటాయి.

మిథున రాశి

ఈ రాశివారి మాటల్లో మాధుర్యం ఉంటుంది. పురోగతి కోసం ప్రయత్నాలు మానొద్దు. స్వీయ నియంత్రణలో ఉండండి. ఉద్యోగం, పరీక్షలకు సంబంధించిన ఇంటర్యూలలో విజయం సాధిస్తారు.

Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

కర్కాటక రాశి

డిసెంబరులో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఏదో విషయంలో కలత చెందుతూనే ఉంటారు. వ్యాపారంలో  హెచ్చు తగ్గులు ఉంటాయి. దాంపత్య సంతోషం పెరుగుతుంది. మీరు చేసే పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు.

సింహ రాశి

ఉద్యోగంలో పురోగతికి బాటలు వేస్తారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు విద్యా పనుల్లో విజయం సాధిస్తారు. 

కన్యా రాశి

స్వీయ నియంత్రణలో ఉండండి. మీ కెరీర్ విషయంలో ఓపికగా వ్యవహరించండి. మీరు స్నేహితుల నుంచి కొత్త ప్రతిపాదనను అందుకోవచ్చు. లాభం  పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అదనపు ఖర్చులు ఉంటాయి.

తులా రాశి

ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనసులో ఏదో బాధ వెంటాడుతుంది. ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇవ్వొద్దు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. 

వృశ్చిక రాశి

ఈ రాశివారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మాటల్లో సమతుల్యత ఉండాలి..ఆచితూచి మాట్లాడడం మంచిది. కుటుంబంతో కలసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. 

ధనుస్సు రాశి

ఈ రాశివారి మనస్సులో అశాంతి ఉంటుంది. సహనంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ కోరికలను అదుపులో ఉంచుకోండి. మీ మాట ప్రభావం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!

మకర రాశి
 
ఈ రాశివారికి మానసికంగా చికాకులు ఉంటాయి కానీ ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి

ఈ రాశివారు పనిలో అదనపు బాధ్యతలు పొందుతారు. వ్యాపారం విస్తరిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

మీన రాశి

ఈ రాశివారిపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడి ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. మేధోపరమైన పని ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫ్రిజ్‌లోని శివలింగం! విజ్ఞానం, విశ్వాసం ఏ కోణంలో చూడాలి!
ఫ్రిజ్‌లోని శివలింగం! విజ్ఞానం, విశ్వాసం ఏ కోణంలో చూడాలి!
18-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
18-07-2026 శనివారం మీ రాశిఫలాలు!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
సింహ రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - జూలై నుంచి డిసెంబర్ మధ్య మీ జీవితంలో ఊహించని మార్పులు!
17-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
17-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget