అన్వేషించండి

అక్టోబర్ 4 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 04న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 04 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 4 October 2025

మేష రాశి

ఈ రోజు మీరు సానుకూల శక్తిని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ పనిని మీరు ఆనందిస్తారు.  ఇది మీ ప్రస్తుత ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తుంది.  ఆరోగ్యంగా కూడా ఉంటారు . కోరికలు కూడా నెరవేరుతాయి. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది
 
శుభ సంఖ్య: 9 
రంగు: ఎరుపు 
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.

వృషభ రాశి

ఈ రోజు మీకు బద్ధకంగా అనిపిస్తుంది.  అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కొంతమంది పరిచయస్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు గందరగోళానికి గురిఅవుతారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. సహనం వహించండి  

శుభ సంఖ్య: 6 
రంగు: తెలుపు 
పరిహారం: దుర్గా మాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.

మిథున రాశి

ఈ రోజు మీరు సానుకూల శక్తిని పొందుతారు. మంచి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ మునుపటి పెట్టుబడి కూడా మీకు లాభాలను తెస్తుంది. మీరు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు, ఇది మీకు చాలా కాలం పాటు ప్రయోజనం చేకూరుస్తుంది. మీ సామాజిక స్థితిని మెరుగుపరచడానికి మీరు మీ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించుకోండి

శుభ సంఖ్య: 5 
రంగు: ఆకుపచ్చ 
పరిహారం: తులసి మొక్కకు నీరు సమర్పించండి.

కర్కాటక రాశి

ఈ రోజు మీరు పనిలో బిజీగా ఉంటారు. మీరు కుటుంబంతో సమయాన్ని ఆనందిస్తారు. అవివాహితుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.  మీ స్థితిని మెరుగుపరచడానికి మీరు ఇల్లు లేదా కార్యాలయంలో శ్రద్ధగా మీ విధులు నిర్వర్తించండి
 
శుభ సంఖ్య: 2 
రంగు: వెండి 
పరిహారం: శివునికి పాలతో అభిషేకం చేయండి
 
సింహ రాశి

ఈ రోజు మీరు మీ పెద్దల ఆశీస్సులతో మంచి ఫలితాలు పొందుతారు. ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతారు. జీవితంలో పురోగతి సాధిస్తారు. మీ ఆధ్యాత్మిక శక్తి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ... మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీకు సహాయపడుతుంది.

శుభ సంఖ్య: 1 
రంగు: బంగారు 
పరిహారం: సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.

కన్యా రాశి

ఈ రోజు మీరు  అసహనంగా ఉంటారు. మీరు కష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. మీ పనిలో ముందుకు సాగడానికి మీరు మీ పెద్దల ఆశీర్వాదం పొందాలి. ఆస్తులలో పెట్టుబడి పెట్టడం కొన్నిరోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ఎదుటివారిలో చెడు లక్షణాల గురించి చర్చించవద్దు
 
శుభ సంఖ్య: 5 
రంగు: ఆకుపచ్చ 
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

తులా రాశి

ఈ రోజు మీరు చేసే ఉద్యోగంలో శుభవార్త  వింటారు.  కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు.

శుభ సంఖ్య: 6 
రంగు: గులాబీ 
పరిహారం: లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు పనిలో బాగా రాణించవచ్చు ..పదోన్నతి పొందుతారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి సలహాదారుని సంప్రదించవచ్చు. ఈ రోజు మీరు మీ శత్రువులపై పైచేయి సాధిస్తారు
 
శుభ సంఖ్య: 9 
రంగు: ఎరుపు 
పరిహారం: శివుడికి నీటితో అభిషేకం చేయండి
 
ధనుస్సు రాశి

ఈ రోజు మీరు మీ పిల్లల కార్యకలాపాలలో బిజీగా ఉంటారు. పిల్లల విద్య కోసం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కష్టమైన పనులను కూడా సులభంగా చేయగలరు. మీరు మీ ప్రియమైన వారి కోసం గృహోపకరణాలు.. బహుమతులపై డబ్బు ఖర్చు చేస్తారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. 
 
శుభ సంఖ్య: 3 
రంగు: పసుపు 
పరిహారం: విష్ణువు పూజ చేయండి
 
మకర రాశి

ఈ రోజు మీరు బద్ధకంగా ఉంటారు. కఠినంగా మాట్లాడకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఇది సమస్యలను కలిగిస్తుంది. ఉదయం కన్నా సాయంత్రానికి పరిస్థితుల్లో సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. 
 
శుభ సంఖ్య: 8 
రంగు: నీలం 
పరిహారం: రావి చెట్టుకు నీరు సమర్పించండి.

కుంభ రాశి

ఈ రోజు మీరు సానుకూల శక్తితో ఉంటారు. ప్రతికూల వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఆత్మగౌరవంత ఉంటారు. కుటుంబ విషయాలలో మీరు మరింత భావోద్వేగంగా  వ్యవహరిస్తారు.  కార్యాలయంలో మంచి ఫలితాలు సాధిస్తారు. 

శుభ సంఖ్య: 4 
రంగు: ఊదా 
పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి.

మీన రాశి

ఈ రోజు మీరు మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు . మీ పొదుపును తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీకు సహాయపడే వ్యక్తిని కలుసుకుంటారు.  ఇతరుల పట్ల  వినయంగా వ్యవహరించండి. 
 
శుభ సంఖ్య: 7 
 రంగు: నీలం 
పరిహారం: విష్ణువుకు తులసి ఆకులను సమర్పించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Ayyappa swamy Temples : శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం! AP & TS లో మాల విరమణకు ఉత్తమ ఆలయాలివే!
Embed widget