అన్వేషించండి

October Born: గతాన్ని తలుచుకుని బాధపడరు..భవిష్యత్ పై ఆశపడరు - అక్టోబరులో జన్మించినవారిలో ఎన్ని ప్రత్యేకతలో!

Fascinating Facts Abot October Born: పుట్టిన నెల ఆధారంగా కూడా ఓ వ్యక్తి వ్యక్తిత్వం చెప్పొచ్చంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణలుు. అక్టోబరులో జన్మించిన వారు ఎలా ఉంటారంటే..

Astrology: అక్టోబరు నెలలో జన్మించిన వాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎంతటి వ్యక్తులనైనా మంత్రముగ్ధుల సత్తా వీరి సొంతం. ఈ నెలలో జన్మించినవారికి స్నేహితులు చాలామంది ఉంటారు...వీరితో స్నేహం చేయాలంటూ చాలామంది తాపత్రయపడతారు. 

అక్టోబరులో పుట్టినవారిలో ఆశావాదం, సానుకూలధృక్పదం ఉంటుంది..ఇది ఎదుటివారిని తొందరగా ప్రభావితం చేస్తుంది

ఎన్ని టెన్షన్లు ఉన్నప్పటికీ ప్రశాంతంగా కనిపిస్తారు..తమ భావాలు, భావోద్వేగాలు అస్సలు బయటపడనీయరు..వీళ్లు అంతర్ముఖులు..

శత్రువుల కన్నా స్నేహితులను సంపాదించుకోవడమే మనిషి గొప్పతనం అని నమ్ముతారు..అందుకే వీరివల్ల ఎవరికైనా మంచే జరుగుతుంది కానీ చెడుజరగదు

ఇతరుల సమస్యలపట్ల అక్టోబరులో జన్మించినవారు చాలా సున్నితంగా ఉంటారు...తాము చేయగలిగిన సహాయం చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. 

వీళ్లు పట్టుదలకు కేరాఫ్.. ఏదైనా పనిని అంత త్వరగా ప్రారంభించరు..ఒక్కసారి మొదలుపెడితే మధ్యలో విడిచిపెట్టరు. గుంపుగా కన్నా సింగిల్ గా బరిలో దిగేందుకు ఇష్టపడతారు..ఏదైనా కానీ సింగిల్ గానే సాధిస్తారు 

ఈ నెలలో జన్మించినవారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి..ఓ దశలో అత్యంత నిరుత్సాహమైన జీవితం గడుపుతారు...కానీ ఎవ్వరూ ఊహించనంత ఆత్మవిశ్వాసం వీరిసొంతం..అందుకే పడిలేచిన కెరటంలా దూసుకెళ్తారు.

విలాసవంతమైన వస్తువులపై వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది..తమకోసం ఖర్చు చేయడం కన్నా తమ ప్రియమైనవారికోసం ఖర్చుచేయడాన్ని ఎంజాయ్ చేస్తారు.. 

అక్టోబరులో జన్మించినవారు సహజంగా తెలివైనోళ్లు..తమకు ఆసక్తిఉన్నరంగంలో జ్ఞానసముపార్జనపై ఎల్లవేళలా దృష్టిసారిస్తారు. అందుకోసం సమయం, డబ్బు పెట్టుబడి పెట్టేందుకు కూడా తగ్గరు.  

పరిస్థితులను అర్థంచేసుకుని అడుగులు ముందుకువేయడంలో వీరికి వీరే సాటి...ఎలాంటి సమస్య ఎదురైనా కుటుంబం, కార్యాలయం, వ్యాపారం, స్నేహం..ఎక్కడైనా కానీ అందర్నీ ఒప్పించి ఉత్తమమైన పరిష్కారాలను చూపించగలరు..

ఒకే ఒక జీవితం..సరదాగా గడిపేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. అందుకే భవిష్యత్ గురించి ఆశపడరు, గతం తల్చుకుని బాధపడరు.. ఈ రోజు సంతోషంగా ఉన్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు.

వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ..రిలేషన్ షిప్ లో ఒక్కసారి కమిటైతే చివరివరకూ అండగా నిలుస్తారు. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో డైలమా ఉండదు.

పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఒక్కసారిగా ఆందోళన చెందుతారు..కానీ అంతలోనే తేరుకుని దానికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. ఎప్పుడో ఏదో జరుగుతుందనే భయాన్ని వదిలేసి ఈ క్షణం పోరాటానికి ధైర్యంగా రంగంలోకి దిగిపోతారు..

తెలివితేటలు, సమాజంపై అవగాహన,  కళలపై మంచి అభిరుచి అక్టోబరులో పుట్టినవారికి ఉంటుంది.. వీరికి దైవభక్తి ఎక్కువే కానీ భగవంతుడిపై కన్నా తమ తెలివితేటలనే ఎక్కువ నమ్ముకుంటారు

వీరిమనసు సున్నితంగా ఉంటుంది.. పరిస్థితులు అనుకూలిస్తే అందరకీ సహకరిస్తారు..లేదంటే సర్దుకుపోతారు..కానీ ఇతరులను ఇబ్బంది పెట్టరు. 

అక్టోబరు జన్మించినవారికి ఎక్కువగా చర్మ సంబంధిత, మధుమేహం వ్యాధులొస్తాయి...

Note: ఓ  ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget