Daily horoscope 28th December 2024: ఈ రాశులవారు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇది!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily horoscope 28th December 2024
మేష రాశి
ఈ రాశివారికి కెరీర్ విషయంలో టెన్షన్ ఉండవచ్చు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇంట్లో క్రమశిక్షణ పాటించండి. మీరు కార్యాలయంలో మీ సామర్థ్యం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు బంధువు నుంచి శుభవార్త వింటారు. స్నేహితులు మీకు చాలా సహాయం చేస్తారు. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పని పట్ల బాస్ చాలా సంతోషంగా ఉంటారు.
మిథున రాశి
ఈ రోజు మీ దినచర్య మీ దగ్గరివారి ఒత్తిడి కారణంగా చెడిపోవచ్చు. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా సంయమనం పాటించండి. మీరు ఎదుటివారిపై మంచి ప్రభావం చూపిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు
కర్కాటక రాశి
మీ కుటుంబ జీవితంలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వండి. మొబైల్ , ఇంటర్నెట్‌ను పరిమితంగా ఉపయోగించుకోండి. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరు గురించి చర్చ జరుగుతుంది. సామాజిక సంక్షేమ పనులలో సహకరిస్తారు. కడుపులో చికాకు వంటి సమస్యలు ఉండవచ్చు.
సింహ రాశి
కొత్త పనిని ప్రారంభించకండి, ఈరోజు పెద్దగా ఆర్థిక లావాదేవీలు చేయకండి. మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మీరు కొత్త వృత్తిని ప్రారంభించే ఆలోచన చేయవచ్చు. ప్రేమ సంబంధాలను పరిమితుల్లో ఉంచండి. మీరు మీ సామర్థ్యాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోలేరు
కన్యా రాశి
ఈ రోజు గౌరవం , ప్రతిష్ట పెరుగుతుంది. యువకులు ప్రేమ వివాహానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ విధానాలను ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంచండి. మీపై పని ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. మీ ప్రతిభను మరింత పెంచుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: 2025లో మకర రాశివారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది కానీ !
తులా రాశి
గతంలో నిలిచిపోయిన ప్రణాళికలను ప్రారంభించడానికి కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. మీరు కార్యాలయంలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. కోపంతో స్పందించవద్దు. మీ సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి ప్రయత్నించండి
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సానుకూల వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. మీ లక్ష్యాల గురించి చాలా భావోద్వేగంగా ఉండవచ్చు. మీరు మీ పాత తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన సమయం ఇది
ధనుస్సు రాశి
ఈ రోజు పాత అప్పుల కారణంగా ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబం , కార్యాలయంలో పరిస్థితుల్లో పెద్దగా మార్పులుండవు. స్నేహితునితో విభేదాలు రావచ్చు. అతిగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు. పిల్లల సమస్యలపై శ్రద్ధ వహించండి
Also Read: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!
మకర రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతారు. మీకు కొత్త బాధ్యతలు రావచ్చు. మీ మనసులో సంతృప్తి భావన ఉంటుంది. నూతన నిర్ణయాలు అమలుచేసేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి.
కుంభ రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి.
మీన రాశి
ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ సమస్యలను మీ తల్లిదండ్రులతో పంచుకోవచ్చు. కంటి చికాకు, తలనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.




















