బాబా వంగా చెప్పినవన్నీ నిజమవుతాయా? 2023లో జరగబోయే భయానక ఘటనలేమిటీ?
బాబా వంగా చెప్పినవన్నీ దాదాపు నిజమయ్యాయి. అందుకే, ఆమె భవిష్యవాణికి అంత పవర్. మరి ఆమె 2023 గురించి ఏం చెప్పింది?
ప్రపంచంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు భవిష్య వాణి చెప్పారు. అలాంటి వారిలో బల్గేరియా ఆధ్యాత్మికవేత్త బాబా వంగా ఒకరు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి 1996లో ఆమె మరణం వరకు కూడా బాబా వంగా భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేశారు. అందుకే ఆమెను నోస్ట్రాడామస్ తో పోల్చారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ మీద సౌరతుఫాన్ ప్రభావం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది 1859 నాటి సంఘటన ఒక ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక వేళ సౌరతుఫాను కనుక వస్తే అది సంవత్సరాల పాటు కొనసాగే అతి పెద్ద బ్లాకవుట్లకు కారణం కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాబా వంగా 2023కు సంబంధించి ఇలాంటి అనేక విషయాలను తన భవిష్యవాణిలో ప్రస్తావించారని చెబుతున్నారు.
భూకక్ష్యా మారిపోతుంది
ప్రస్తుతం సూర్యుని చుట్టూ తిరుగుతున్న కక్ష్య నుంచి 2023లో మారుతుందని బాబా వంగా ప్రిడిక్ట్ చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఇది భూమి మీద నివసిస్తున్న ప్రాణుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ప్రతి ఏడాది 582 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇది ఒక దీర్ఘవృత్తాకార కక్ష్య. ఇలా కక్ష్య ఆకారం ఏర్పడడానికి సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల బలాబలాల మీద ఆదారపడి ఏర్పడింది. ప్రస్తుతం ఆ గ్రహబలాల కారణంగానే భూకక్ష్య మారవచ్చు. మార్పులు ఎలాంటివైనా సక్రీయ పద్ధతిలో మాత్రమే జరుగుతాయి. అతి చిన్న మార్పులు కూడా మన భూవాతావరణం మీద పెను మార్పులకు కారణం కావచ్చు.
జీవ ఆయుధాల ప్రయోగం
ఒక దేశం 2023లో జీవ ఆయుధాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తుందని బాబా వంగా చెప్పారట. ప్రస్తుత భౌగోళిక రాజకీయ సమస్యలకు సంబంధించిన ఈ అంచనా చాలా ఆందోళన కలిగించే విషయం.
న్యూక్లియర్ ప్లాంట్ లో పేలుడు
ఒక అణు విద్యుత్ ప్లాంట్ లో జరిగే పేలుడు వల్ల విషపూరిత మేఘాలు ఆసియా ఖండాన్ని కప్పేస్తాయని వంగా ప్రిడిక్ట్ చేశారు. ఈ విషపూరిత మేఘాల వల్ల ఆ ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది. అణువిద్యుత్ ప్లాంట్ లో పేలిన ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్యాలు వ్యాపించడమే కాదు, ఇతర దేశాలు కూడా అనారోగ్యాల బారిన పడతారని ఆమె చెబుతోంది. ప్రస్తుతం ఉక్రేయిన్లోని జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా ఆధీనంలోకి తీసుకోవడం గురించి సర్వత్రా చర్చ సాగుతోంది.
మనుషులు ప్రయోగశాలల్లో జన్మిస్తారు
మనుషులు 2023 నుంచి ప్రయోగశాలల్లో పుడతారని బాబా వంగా అంచనా వేశారు. ఇలాంటి లాబ్ లలో పుట్టబోయే బిడ్డల చర్మ రంగును, తెలివితేటలను తల్లిదండ్రుల ముందుగానే నిర్ణయించుకోవచ్చు. అంటే జీవ ప్రక్రియ మొత్తం ముందుగానే నిర్ణయించబడుతుందని అర్థం. అంతా నియంత్రణలోనే ఉంటుందని బాబా వంగా ఊహించారట.
2022లో వివిధ దేశాలు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటాయని బాబా వంగా భవిష్యవాణి లో చెప్పారు. కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొంటాయిని కూడా ఆమె చెప్పారు. ఇటలీ, పోర్చుగల్ లో కరువు కాటకాలు వస్తాయని ఆమె చెప్పారు.
ఆమె భవిష్యవాణిలో కొన్ని ఫలించినా సరే అవి చాలా ఆందోళనకరంగానూ, భయపెట్టెవిగానూ ఉన్నాయి. మరో వైపు ఆమె భవిష్యవాణి చాలా నిగూఢంగా కూడా ఉంది. అలాగే ఎలాంటి ధృవీకరణలు కూడా లేవు. ఆమె భవిష్యవాణి చాలా వరకు అసంపూర్ణంగా ఉందని కూడా అంటున్నారు. ఆమె అంచనాలు ఫలించకూడదని మాత్రమే మనం ఆశించాలి.
Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!