Baba Vanga Predictions 2026: మూడవ ప్రపంచ యుద్ధ హెచ్చరిక నుంచి పుతిన్ పతనం వరకు ప్రపంచ రాజకీయాలపై 2026 ఎలాంటి ప్రభావం చూపుతుంది
Baba Vanga 2026 Predictions : మూడవ ప్రపంచ యుద్ధ హెచ్చరిక నుంచి పుతిన్ పతనం వరకు ప్రపంచ రాజకీయాలపై 2026 ఎలాంటి ప్రభావం చూపుతుంది? బాబా వాంగ జ్యోతిష్యం భయపెడుతోందా?

Baba Vanga Predictions 2026: ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగినప్పుడల్లా, బాబా వాంగ జోస్యాలు చర్చనీయాంశమవుతాయి. 2026 సమీపిస్తున్నందున, భౌగోళిక రాజకీయ మార్పులు, పర్యావరణ గందరగోళం, ప్రపంచ యుద్ధం వంటివాటిపై అత్యంత కలవరపరిచే జోస్యాలపై మళ్లీ అందరి దృష్టి పడుతోంది. అంధురాలైన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, భవిష్యవాణి చెప్పే బాబా వాంగ అత్యంత దిగ్భ్రాంతికరమైన వాదనలలో మూడవ ప్రపంచ యుద్ధ హెచ్చరిక, పుతిన్ పతనం ఉన్నాయి.
ఇంగ్లీష్ వెబ్‌సైట్ ది ఎక్స్‌ప్రెస్ US నివేదిక ప్రకారం
అంధురాలైన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త 2026 సంవత్సరాన్ని యుద్ధం నుంచి కృత్రిమ మేధస్సు వరకు అనేక రంగాలలో అస్థిరత, అనిశ్చితి, మార్పులతో కూడిన సంవత్సరంగా సూచిస్తున్నారు.
2026 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది?
బాబా వాంగ జోస్యం ప్రకారం 2026 సంవత్సరం భౌగోళిక రాజకీయంగా అల్లకల్లోలంగా ఉంటుంది. 2026లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, ఇందులో ప్రధానంగా ప్రపంచ శక్తుల మధ్య పెద్ద ఎత్తున సైనిక ఘర్షణలు ఉంటాయని ఆమె జోస్యం చెప్పారు. ఈ సైనిక ఘర్షణలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయని, ఇది దీర్ఘకాలిక రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు వేగంగా వ్యాపిస్తాయని నివేదిక పేర్కొంది.
చైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడం, రష్యా-అమెరికా మధ్య ఘర్షణ వంటివి ఉన్నాయి. ఈ సంఘటనలు ఆర్థిక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని, మార్కెట్లలో భారీ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చని భావిస్తున్నారు.
2026లో పర్యావరణ విపత్తుల జోస్యాలు
2002లో బ్రిటన్‌లో సంభవించిన వరదలకు కూడా బాబా వాంగ ముందే చెప్పారు. 2026 సంవత్సరానికి కూడా ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరించారు. ఆమె జోస్యాలలో తుఫానులు, సునామీలు, భూకంపం ఉన్నాయి, అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంభవిస్తాయో స్పష్టంగా తెలియదు.
రాజకీయ కోణం నుంచి చూస్తే 2026లో కొత్త రష్యన్ నాయకుడు ఉద్భవిస్తారని బాబా వాంగ జోస్యం చెప్పారు, ఇది వ్లాదిమిర్ పుతిన్ పాలన ముగింపునకు దారితీస్తుందని, ఉక్రెయిన్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతాయని భావిస్తున్నారు.
ది ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం
రష్యాకి ఈ రాబోయే నాయకుడిని శక్తివంతమైన గురువుగా అభివర్ణించారు.
గ్రహాంతరవాసులతో సంప్రదింపులు కూడా జరుగుతాయని చెప్పారామె. నవంబర్ 2026లో మానవాళి గ్రహాంతర జీవులను మొదటిసారిగా ఎదుర్కొంటుందని ఆమె చెప్పినట్లు సమాచారం.
మిర్రర్ నివేదిక ప్రకారం
ఆకాశంలో భారీ అంతరిక్ష నౌకలు భూమి వాతావరణంలోకి ప్రవేశించడాన్ని స్పష్టంగా చూడవచ్చని పేర్కొన్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
మోక్ష ద్వారం తెరుచుకునే వేళ! వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శ్రీ మహావిష్ణువు శ్లోకాలతో తెలియజేయండి!
వైకుంఠ ఏకాదశి పూజ తేలికగా చేసుకొనే విధానం! ఇంట్లోనే సులువుగా శ్రీ మహావిష్ణువుని పూజించండి ఇలా!
ఆస్తి సమస్యలా? గృహ నిర్మాణం ఆలస్యమవుతోందా? ఈ ఆలయం పరిష్కార మార్గం చూపిస్తుందట! పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















