అన్వేషించండి

ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి ఈ వారం ( 23 June To 29 June 2024) ఆదాయం, ఆనందం!

Weekly Horoscope: జూన్ నెల ఆఖరి వారం ధనన్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి అనుకోని ఆదాయం చేతికందే సూచనలున్నాయి. వారం మొత్తం ఆనందంగా ఉంటారు... ఒక్కో రాశి వార ఫలితం ఇక్కడ తెలుసుకోండి...

 weekly horoscope 23 june 2024 to 29 june 2024  

ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)

ఈ వారం ధనస్సు రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. గత కొన్నాళ్లుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సాధించే అవకాశాలను పొందుతారు...అయితే పని విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి.  నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అనుకున్న ప్రణాళికలను చక్కగా అమలు చేయడంలో విజయం సాధిస్తారు. అతి విశ్వాసం కారణంగా నష్టపోయేప్రమాదం ఉంది. కళారంగంలో ఉండేవారికి కొన్ని ఒడిదొడుకులు తప్పవు. గుర్తుతెలియని వ్యక్తులతో లావాదేవీల విషయంలో  జాగ్రత్తగా ఉండండి. అహంకారాన్ని దరిచేరనివ్వొద్దు.  

Also Read: జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది! 

మకర రాశి  (Capricorn Weekly Horoscope)

ఈ రాశి వ్యాపారులు ఈ వారం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. సాంకేతిక విద్యలో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. మీ పనితీరులో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తారు. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకున్నవారికి ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకుని ఆచరణాత్మకంగా విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల కారణంగా సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి మరికొన్నాళ్లు అడ్డంకులు ఎదురవుతాయి. అనారోగ్యం కోసం డబ్బులు ఖర్చుచేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

కుంభ రాశి  (Aquarius Weekly Horoscope)

ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారం జోరందుకుంటుంది కానీ కొత్త ప్రయోగాలకు కొన్నాళ్లు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ జీవనశైలిలో చేసుకున్న మార్పుల కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి సమయం ఇది. ఏ విషయంపైనా ఎక్కువ చర్చలు పెట్టొద్దు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.  స్నేహితుల సహకారంతో కొన్ని పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం మారాలి అనే ఆలోచన చేస్తారు.

Also Read: జూన్ 23 నుంచి జూన్ 29 వారఫలాలు: ఈ 4 రాశుల ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులకు ఈ వారం గ్రహాలు అనుకూలం!

మీన రాశి  (Pisces Weekly Horoscope)

ఈ వారం ఈ రాశివారు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది ..అయితే..మీ మనసులో ఉండే కొన్ని సందేహాల ప్రభావం మీ బంధంపై పడుతుంది.  తప్పుడు విషయాలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శించవద్దు. వారం మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. మీ  వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget