అన్వేషించండి

Horoscope Today 4th February 2025: ఈ రాశులవారు ఆస్తి కొనుగోలు, అమ్మకం ద్వారా ప్రయోజనం పొందుతారు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 4 రాశిఫలాలు


మేష రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరు ప్రశంసలు పొందుతుంది. సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణించేటప్పుడు తెలియని వ్యక్తులను విశ్వసించి రిస్క్ తీసుకోకండి.

వృషభ రాశి

ఈ రోజు ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేస్తారు. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.  

మిథున రాశి

ఈ రోజు అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అనవసర చర్చలకు దిగొద్దు. వ్యాపారులు మంచి ఫలితాలు పొందలేరు. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మనసు చెప్పింది వినండి. 

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
 
కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశి అవివాహితులకు వివాహం  నిశ్చయమవుతుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. మీ ప్రవర్తనతో అందరూ సంతోషంగా ఉంటారు. ఫైనాన్స్‌కు సంబంధించిన కార్యకలాపాలకు రోజు జాగ్రత్తలు తీసుకోండి. 

సింహ రాశి 

ఈ రోజు మీరున్న రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులు మీ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. 

కన్యా రాశి

ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. కర్మాగారాలలో పనిచేసే వారు భద్రతా ప్రమాణాలను అనుసరించండి.  ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పెరుగుతాయి.  

తులా రాశి

ఈ రోజు ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆహారం తీసుకోవడం నిర్లక్ష్యం కారణంగా పొట్టకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అనవసర ప్రయాణాలు చేయవద్దు.  

Also Read: అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు  కుదుర్చుకునేందుకు మంచి రోజు. వైవాహిక జీవితం శృంగారంతో నిండి ఉంది. ఆస్తి కొనుగోలు ,  అమ్మకం ద్వారా ప్రయోజనం పొందుతారు. థియేటర్లు మరియు హోటల్ రంగాల్లో ఉండే వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. 

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారికి ఈ రోజు మంచిది. వృత్తిపరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ముఖ్యమైన పనులను ప్రాధాన్యతలోకి తీసుకురావడం ద్వారా పూర్తి చేయండి. మీరు భాగస్వామ్యంతో పనిచేయాలనుకుంటే ఈ రోజు చాలా బాగుంది. ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి.'

మకర రాశి

ఈ రోజు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతుంది. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగుల సలహాపై శ్రద్ధ వహించండి.స్నేహితుల కారణంగా సంతోషంగా ఉంటారు. 

కుంభ రాశి

ఈ రోజు మీరు మీ దినచర్య మారుతుంది. వ్యక్తిగత జీవితంలో కలతలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం సక్రమంగా సాగుతుంది. మీరున్న రంగంలో ప్రశంసలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసే కొత్తవ్యక్తులు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతారు. 

మీన రాశి

మీరు ప్రారంభించే పనులకు అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారు. నూతన వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget