అక్టోబరు 06 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ ఆదివారం అదృష్టం కలిసొస్తుంది!
Horoscope Prediction 6th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 6th October 2024
మేష రాశి
ఈ రోజు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసొస్తుంది. వ్యాపారంలో రోజువారీ ఆదాయం పెరుగుతుంది. చిరు ప్రయత్నంతోనే మీరు చేపట్టిన పని విజయవంతం అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది.
వృషభ రాశి
చాలా కష్టపడిన తర్వాత మీరు అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి లభించవచ్చు. కంప్యూటర్ వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మీ వైఖరిలో మార్పులు చేసుకుంటారు. స్నేహితులను కలుస్తారు.
మిథున రాశి
ఈరోజు కుటుంబ సభ్యులు మీ నిర్ణయంతో చాలా సంతోషంగా ఉంటారు. మీ పనులు కొంత క్లిష్టంగా ఉండవచ్చు. సహోద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
Also Read: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!
కర్కాటక రాశి
అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుగుతాయి. ఆకస్మికంగా అతిథులు రావొచ్చు.
సింహ రాశి
ఇంట్లో చిన్న చిన్న సమస్యలుంటాయి. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూసుకోండి. ఈ రోజు మంచి రోజు అవుతుంది. వినోదం కోసం డబ్బు ఖర్చుచేస్తారు.
కన్యా రాశి
ప్రతికూల ఆలోచనలు వదిలేయండి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారు.
Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు
తులా రాశి
కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పని పూర్తయ్యేవరకూ ఓపిక పట్టండి. జీవిత భగాస్వామి నుంచి మద్దతు ఉంటుంది. కెరీర్లో నూతన మలుపులుంటాయి. గతంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు అధికారులతో సమావేశం ముఖ్యమైనది కావచ్చు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సంభాషణల సమయంలో మరింత చిరాకు ఉండవచ్చు.
ధనస్సు రాశి
మీ బంధువుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది వైవాహిక బంధం బాగానే ఉంటుంది నూతన వ్యవహారాలు కలిసొస్తాయి. ఒకేసారి చాలా పనులు చేయాలని ప్రయత్నించవద్దు. మీ ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మకర రాశి
ఈ రోజు మీరు శుభవార్త వింటారు. వ్యాపార పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పాత వివాదాలను మళ్లీ గుర్తుచేసుకోవద్దు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో ప్రయోజనాలు పొందుతారు.
Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!
కుంభ రాశి
ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఆధ్యాత్మిక విషయాలపై రహస్య అధ్యయనాలు చేస్తారు. ఉద్యోగులు పై అధికారుల నుంచి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయడం మంచిది.
మీన రాశి
కొత్తగా పరిచయం అయిన వ్యక్తులపట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులు ఎక్కడివక్కడ ఆగిపోతాయి. బద్ధకాన్ని వీడండి. ప్రియమైనవారి సలహాలు పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. వైవాహిక బంధంలో అసంతృప్తి ఉంటుంది.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.