Daily Horoscope Today 30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు
Horoscope Today 30th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
30th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఓ పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు..ఇది చిన్న ట్రిప్ కావొచ్చు కానీ దీనివల్ల భవిష్యత్ తో పొందే ప్రయోజనం ఎక్కువ. ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు..సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మధ్యాహ్నం సమయం మంచిది. లెమన్ ఎల్లో రంగు దుస్తులు మీలో ఈ రోజు పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతాయి
వృషభ రాశి
మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు మంచి రోజు. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.అదృష్టం కలిసొస్తుంది. రోజు ఆరంభం కన్నా గడిచేకొద్దీ మీకు బావుంటుంది. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు పింక్
మిధున రాశి
మిమ్మల్ని మీరు సానుకూలంగా భావిస్తారు. కెరీర్ ను కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. సానుకూల సమయం, శక్తి...ఈ రెండూ మీకు అనుకూలంగా ఉన్నాయి వినియోగించుకోండి...భవిష్యత్ ను మరింత మెరుగుపరచుకోండి. వ్యాపార ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపేయడం మంచిది. మీ భాగస్వామి లేదా ప్రియమైన వారితో కలిసి భోజనం చేయడానికి బయటకు వెళతారు. డార్క్ బ్లూ కలర్ మీకు శ్రేయస్కరం
Also Read: ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కొంచెం టెన్షన్‌గా ఉన్నట్టు అనిపిస్తారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు... మీ తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలరు. మీకు మీరే ఆదర్శం. పరధ్యానంగా ఉండొద్దు. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై మరింత శ్రద్ధ పెట్టండి. సమస్యల నుంచి పారిపోవద్దు వాటిని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నించండి. గ్రే కలర్ ఈరోజు చాలా శ్రేయస్కరం.
సింహ రాశి
మీ ఉత్సాహం కొంచెం తగ్గుతుంది. ఎవ్వరితోనూ వాదించకపోవడం మంచిది. మీ ఈ ధోరణి నియంత్రించడానికి ప్రయత్నించండి, లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు లేదంటే మీ ప్రియమైన వారు మీకుదూరమవుతారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వీడాలి. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు ఎరుపు, నలుపు...
కన్యా రాశి
ఈ రోజు మీరు గందరగోళానికి గురవుతారు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలకు దూరంగా ఉండండి. నూతన ప్రణాళికలు వేసుకునేందుకు మంచి సమయం. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటాయి కానీ సాల్వ్ చేస్తారు. కుటుంబసభ్యుల మాట వినడం వల్ల మీ సమస్యలు కూడా తీరుతాయి. మీకుఈ రోజు ఎరుపు రంగు కలిసొస్తుంది.
తులా రాశి
ఈ రోజు మీ ఆలోచనలను రియాలిటీగా మార్చడానికి సిద్ధంగా ఉంటారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు..పెండింగ్ ప్రణాళికలు అమలుచేస్తారు. కుంభ రాశిలో చంద్రుడి సంచారం మీకు సానుకూల ఫలితాలనిస్తుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఈ రోజు పెండింగ్ పనులు ఉంచొద్దు. మెరూన్ కలర్ మీకు కలిసొస్తుంది.
Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు
వృశ్చిక రాశి
మీరు జీవితంలో గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు. వివిధ రంగాలలో పురోగతి లేకపోవడం వల్ల మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు.ఈ విరామ కాలం త్వరలో ముగుస్తుంది. ఎంత దూరం వచ్చారో , మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు ఏం చేయగలరో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. మీ సమస్యలను స్నేహితుడితో చర్చించడం వల్ల మీరు మంచి అనుభూతి చెందుతారు. తెలుపు రంగు మీ మనోబలాన్ని పెంచుతుంది
ధనుస్సు రాశి
ఈ రోజు మీ బయటి వ్యవహారాలు పక్కనపెట్టి ఇంటి పనులపై దృష్టి సారించాలి. కుంభ రాశిలో చంద్రుడి సంచారం మీకు ప్రశాంతతనిస్తుంది.మీ ప్రియమైన వారినుంచి మీకు సహాయం అందుతుంది.సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. బంగారం రంగు మీకు కలిసొస్తుంది.
మకర రాశి
మీరు ప్రతివిషయం గురించి ఆశావాదంతో ఉంటారు. ఈ రోజు మీరు పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. అయితే గతంలోలా ఆలస్యం కాకుండా విజయం మిమ్మల్ని వెంటనే వరిస్తుంది. కళ్లు నెత్తిపై పెట్టుకోవద్దు...నేలవైపు చూస్తే మరింత ఎదుగుతారు. మీ పనికి కొత్త నైపుణ్యాలను జోడించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మెరూన్ కలర్ మీకు కలిసొస్తుంది.
కుంభ రాశి
మీరు కొంచెం నిరాశగా లేదా విచారంగా ఉండవచ్చు. కష్ట సమయంలోఆశను కోల్పోకుండా మరింత ముందుకు సాగేందుకు ప్రయత్నించండి. మీ మనసులో అనవసర ఆలోచన తీసేయండి. ఇతరుల తప్పులను క్షమించండి . మనసులో నెగిటివ్ ఆలోచనలు తీసేయండి. ఈ రోజు నీలం రంగు మీకు శుభప్రదం
మీన రాశి
ఒక్కసారి మీరు మీ మనస్సులో ఏదైనా ఫిక్సైతే దాన్ని సాధిస్తారు.మీ పనితీరుని మీ సీరియర్లు మెచ్చుకుంటారు. ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. రోజు ముగిసేలోపు మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రోజు నారింజ రంగు మీకు అదృష్టాన్ని అందిస్తుంది.