అన్వేషించండి

Surya Grahan 2026: ఫిబ్రవరి 17న కుంభ రాశిలో సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం! జాగ్రత్తలు తప్పనిసరి

Surya Grahan 2026 in Kumbh: ఫిబ్రవరి 13న ఉదయం 4 గంటల 14 నిమిషాలకు సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో నెలరోజులు సంచరిస్తాడు. ఈ ప్రభావం ఉంటుంది..

Surya Grahan 2026: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న సంభవిస్తుంది. ఈ గ్రహణం శని రాశి అయిన కుంభ రాశిలో సంభవిస్తుంది.  వృషభం, సింహం, వృశ్చిక , కుంభ రాశుల వారిపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
 
2026 సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026న ఫాల్గుణ పౌర్ణమి రోజు  సంభవిస్తుంది. శాస్త్రీయ దృక్కోణం నుంచి గ్రహణాలను ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనగా చూస్తారు. అయితే, జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుంచి ఏ గ్రహణమూ సాధారణమైనది కాదు.. వాస్తవానికి, దీర్ఘకాలిక గ్రహణాలు రాశిచక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కాబట్టి, వాటిని నివారించడానికి ప్రత్యేక జాగ్రత్తలు  తీసుకోవాలి.

సూర్య గ్రహణం 2026 సమయం

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3:26 గంటల నుంచి సాయంత్రం 7:57 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం 4 గంటల 32 నిమిషాల పాటు కొనసాగుతుంది . ఇది అగ్ని వలయం లాంటి గ్రహణం అవుతుంది. అయితే, ఇది భారత్ లో కనిపించదు కాబట్టి సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణం మనకు కనిపించినా లేకున్నా  కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది.
 
ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం శని రాశి (కుంభ రాశిలో సూర్యగ్రహణం)లో సంభవిస్తుంది.

శని  - సూర్యుడి మధ్య తండ్రి-కుమారుల సంబంధంతో పాటూ శత్రుత్వం ఉంటుంది. అందువల్ల శని రాశి అయిన కుంభరాశిలో సూర్యగ్రహణం కుంభరాశితో సహా కొన్ని ఇతర రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. గ్రహణ సమయంలో సూర్యుడి ప్రభావం కొన్ని రాశిచక్ర గుర్తులకు సవాళ్లను కలిగించవచ్చు, మరికొన్నింటికి మార్పు   కొత్త అవకాశాలను తెస్తుంది. కొన్ని రాశులవారు  కెరీర్, ఆరోగ్యం,, ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు
 
వృషభ రాశి

కుంభ రాశిలో సూర్యుడి సంచారం మీ వృత్తి , సామాజిక స్థితిపై పడుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ కృషి ఫలిస్తుంది, కానీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
 
సింహ రాశి (Leo)

సూర్యుడు మీ రాశిని పాలిస్తాడు. కాబట్టి, గ్రహణం సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో  ఓర్పు  చాలా అవసరం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.

వృశ్చిక రాశి  (Scorpio)

గ్రహణ సమయంలో ఈ రాశివారిపై కుటుంబం , మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడులు లేదా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి.

కుంభ రాశి ( Aquarius) 
 
మీ రాశిలో సంభవించే సూర్యగ్రహణం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కానీ అహంకారం లేదా తొందరపాటు కూడా హాని కలిగించవచ్చు. ఆరోగ్యానికి మరియు పనిలో మితంగా ఉండటం చాలా అవసరం. నల్ల నువ్వులు, ఆవనూనె దానం చేయండి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 8-14 వారఫలాలు: మిథునం, కర్కాటక రాశుల కెరీర్, ప్రేమ, ఆర్థిక స్థితి ఈ వారం ఎలా ఉంటుందంటే!
నవంబర్ 8-14 వారఫలాలు: మిథునం, కర్కాటక రాశుల కెరీర్, ప్రేమ, ఆర్థిక స్థితి ఈ వారం ఎలా ఉంటుందంటే!
నవంబర్ 8-14 వారఫలాలు: మేషం, వృషభ రాశులకు ఎవరికి ధనలాభం, ఎవరు జాగ్రత్త పడాలి?
నవంబర్ 8-14 వారఫలాలు: మేషం, వృషభ రాశులకు ఎవరికి ధనలాభం, ఎవరు జాగ్రత్త పడాలి?
నవంబర్ 7 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయ్!
నవంబర్ 7 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయ్!
నవంబర్ 7 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 7 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఎలాంటి ఫలితాలు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
Embed widget