Rasi Phalalu October 11: 2025 అక్టోబర్ 11 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 11న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 11 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 11 October 2025
మేష రాశి
ఈ రోజు మేషం రాశి వారికి శుభంగా ఉంటుంది. సామాజిక రంగం, ఉద్యోగం లేదా వ్యాపారం - ప్రతిచోటా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళే ఆలోచనలో ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గాయం కావచ్చు. ఆర్థిక విషయాలలో రోజు అనుకూలంగా ఉంటుంది.
శుభ సంఖ్య: 3
రంగు: ఎరుపు
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి
వృషభ రాశి
ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. పని రంగంలో విజయం, కీర్తి లభిస్తుంది. ఇంట్లో ఆనందం శాంతి వాతావరణం ఉంటుంది. బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో మీ వ్యూహం విజయవంతమవుతుంది. ఆర్థిక లాభం కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ స్థిరత్వం ఉంటుంది. కార్యాలయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది, సంయమనం పాటించండి.
శుభ సంఖ్య: 6
రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవికి తెల్లని పువ్వులను సమర్పించండి
మిథున రాశి
ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధ్యానం , సాధనతో మానసిక శాంతి లభిస్తుంది. రహస్య జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అహంభావానికి దూరంగా ఉండండి, మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఆకస్మిక ధనలాభం యోగం ఉంది. కొత్త పనిని ప్రారంభించడానికి రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్యం బాగుంటుంది.
శుభ సంఖ్య: 5
రంగు: ఆకుపచ్చ
పరిహారం: తులసికి నీరు సమర్పించండి
కర్కాటక రాశి
ఉదయం కొంత కష్టంగా ఉండవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎక్కువ ప్రయత్నాలు చేసినప్పటికీ, పని ఆలస్యం అవుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి
శుభ సంఖ్య: 2
రంగు: పాల తెలుపు
పరిహారం: శివునికి పాలతో అభిషేకం చేయండి
సింహ రాశి
ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసేసుకోవద్దు. చేపట్టిన పనిలో ఆశించిన ఫలితం సాధ్యం అవుతుంది. పోటీదారులు ఓడిపోతారు. ఆర్థిక లాభం ఉంటుంది . కుటుంబ సభ్యుల నుంచి తక్కువ సహకారం లభిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
శుభ సంఖ్య: 1
రంగు: బంగారు
పరిహారం: సూర్య భగవానుడికి నీరు సమర్పించండి
కన్యా రాశి
రోజు ప్రారంభం ఆందోళన, అలసటతో ఉంటుంది. కొత్త పనులకు రోజు మంచిది, కానీ ఖర్చులు పెరగవచ్చు. ఎవరి మాట వినకండి..మీ మనసు చెప్పింది చేయండి. సంయమనంతో పని చేయండి. ఇంట్లో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు.
శుభ సంఖ్య: 7
రంగు: నీలం
పరిహారం: గణేశుడికి దూర్వా సమర్పించండి
తులా రాశి
ఈ రోజు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. ప్రారంభంలో నిరాశ ఉండవచ్చు. తల్లిదండ్రులతో విభేదాలు లేదా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి. నీరు , ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండండి. భావోద్వేగాలను నియంత్రించండి.
శుభ సంఖ్య: 4
రంగు: గులాబీ
పరిహారం: దుర్గా మాతకు హారతి ఇవ్వండి
వృశ్చిక రాశి
మొండి స్వభావం , అదుపులేని మాటల వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. భ్రమల కారణంగా పని ప్రభావితమవుతుంది. ఓపిక పట్టండి..ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున సంయమనం పాటించడం ముఖ్యం.
శుభ సంఖ్య: 9
రంగు: ముదురు ఎరుపు
పరిహారం: మంగళుడి అనుగ్రహం కోసం ఎర్ర కందిపప్పు దానం చేయండి
ధనుస్సు రాశి
అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. ఉద్యోగం , వ్యాపారంలో విజయం, పదోన్నతి ధనలాభం సాధ్యమవుతుంది. పెద్దల ఆశీస్సులతో మానసిక శాంతి లభిస్తుంది. సాయంత్రం అలసట ఉంటుంది. భావోద్వేగాలకు లోనై రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి.
శుభ సంఖ్య: 8
రంగు: పసుపు
పరిహారం: విష్ణువుకు పూజించండి
మకర రాశి
కుటుంబం , వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. చిన్న ప్రయాణం లేదా యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారి నుంచి శుభవార్త వింటారు
శుభ సంఖ్య: 10
రంగు: బూడిద
పరిహారం: శని దేవునికి నువ్వుల నూనెను సమర్పించండి
కుంభ రాశి
ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులు , స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కష్టపడి పనిచేసిన తర్వాత ఆర్థిక లాభం ఉంటుంది. ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
శుభ సంఖ్య: 11
రంగు: ఆకాశ నీలం
పరిహారం: హనుమాన్ ఆలయంలో ఎర్రటి పువ్వులను సమర్పించండి
మీన రాశి
నకారాత్మక ఆలోచనలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి , ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో అధికారులతో సమన్వయం పాటించండి. పిల్లల గురించి ఆందోళన పెరుగుతుంది. ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి.
శుభ సంఖ్య: 12
రంగు: సముద్రపు ఆకుపచ్చ
పరిహారం: విష్ణువు ఆలయానికి వెళ్లి బియ్యం దానం చేయండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















