News
News
X

Daily Horoscope Today 18th November 2022: ఈ రాశులవారికి స్నేహితుల సలహాలు కలిసొస్తాయి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది- నవంబరు 18 రాశిఫలాలు

Horoscope Today 18th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

18th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
మీ కోపం, మొండి స్వభావాన్ని నియంత్రించండి ముఖ్యంగా సమావేశాలు లేదా పార్టీలో. ఈ రోజు మీకు అనుకోని ఖర్చులుంటాయి. బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకునేందుకు ఈ రోజు మంచిరోజు. వివాదాల్లో తలదూర్చకుండా మీపని మీరు చేసుకోవడం ఉత్తమం

వృషభ రాశి
అనుకున్న పనుల్లో బిజీగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు నియంత్రించేందుకు ప్రణాళికలు వేసుకోండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

మిథున రాశి
మీ ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి.కుటుంబ సభ్యుల అవసరాలపై దృష్టి సారించండి. ప్రేమికులకు కలిసొచ్చే సమయం ఇది..పెళ్లి దిశగా అడుగేస్తే సమయం అనుకూలిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 

News Reels

Also Read: మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తథ్యం

కర్కాటక రాశి
స్నేహితుల సలహా పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడినట్టు అనిపిస్తుంది.ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు పనితీరుతో మెప్పిస్తారు.

సింహ రాశి
ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో అసమ్మతి కారణంగా కూడా మీపై ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రభావం మీ పనితీరుపై పడుతుంది. తల్లివైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించండి

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు విశ్రాంతి చాలా అవసరం. 

తులా రాశి
మీ అంచనాలు తారుమారు అవుతాయి. అదనపు ఆదాయం కోసం సృజనాత్మకంగా ఆలోచించండి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. రోజంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు.

Also Read: 'అంతా మా కర్మ', 'ప్రారబ్ధం' అంటారు కదా, ఎందుకలా అంటారు - కర్మ అంటే ఏంటి!

వృశ్చిక రాశి
ఆరోగ్యంపై దృష్టి సారించండి. యోగా, ధ్యానం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. డబ్బు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. 

ధనుస్సు రాశి
మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ప్రయాణం వల్ల తొందరగా అలసిపోతారు. ఈ రోజు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితులను కలిసే అవకాశం ఉంది. రోజంతా సంతోషంగా ఉంటారు. 

మకర రాశి
ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది..మాట తూలకుండా జాగ్రత్త  పడండి. ప్రయాణాల వల్ల చికాకు పెరుగుతుంది. అనవసర కోపాన్ని తగ్గించుకోండి..ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

కుంభ రాశి
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.  భూమి లేదా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ఈరోజు మీకు సరికాదు. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారులు నూతన ప్రణాళికలు వాయిదా వేయండి.

మీన రాశి
తలపెట్టిన పనుల్లో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. సానుకూల ఆలోచనలు మీకు మంచి చేస్తాయి. పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. అయితే సరైన సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టండి. ప్రేమికులకు మంచి రోజు..

Published at : 18 Nov 2022 05:10 AM (IST) Tags: Horoscope Today astrological predictions forNovember 2022 18th November horoscope today's horoscope 18 November 2022 18th November 2022 Rashifal

సంబంధిత కథనాలు

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Chanakya Neeti Telugu: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Chanakya Neeti Telugu:  ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Daily Horoscope Today 30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Daily Horoscope Today  30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం, కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం,  కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్