అన్వేషించండి

YSRCP: సురక్షా క్యాంపెయిన్ లో థ్యాంక్యూ జగనన్న, SMS కాంటెస్ట్ ను ప్రారంభిస్తున్న వైసీపీ

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత పార్టిలో అందరిపైనా ఉందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి మరో ఎస్ ఎమ్ ఎస్ కార్యక్రమాన్ని తలపెట్టింది. జగనన్న సురక్షా కార్యక్రమాల పై లబ్దిదారుల అంగీకారంతో "థాంక్యూ జగనన్న"అంటూ ఎస్ ఎమె ఎస్ ను పంపించేందుకు ఏర్పాట్లు చేసింది.

ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్షా కార్యక్రమాలు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత పార్టిలోని అందరిపైనా ఉందని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి అన్నారు.  తాడేపల్లి  పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో విజయసాయిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు..  జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై ఒకటి నుండి మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా ఉండటం తో పాటుగా  శిబిరాల్లో పాల్గొనాలని చెప్పారు.  అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి క్యాంపులో పార్టీకి కీలక నేతలు క్రియాశీలకంగా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చూడాలని సూచించారు.. 

శాసన సభ్యులు కీలకంగా ఉండాలి...
ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి  చెప్పారు. ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగనన్న సురక్ష క్యాంపు  ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించాలని వారికి సూచించారు.. ధ్రువీకరించబడిన మూడో జాబితా గృహ సారధులందరూ జగనన్న సురక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలాగా ఎమ్మెల్యేలు కోఆర్డినేట్లు చూడాలన్నారు..

అదే సమయంలో "థాంక్యూ జగనన్న"
సర్కార్ తో పాటుగా పార్టి కూడ సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగ తీసుకొని నడిపించటంతో ప్రజల్లో భరోసా కలుగుతుందని విజయ సాయి అభిప్రాయపడ్డారు.  సురక్ష క్యాంపెయినింగ్ సమయంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని పౌరులు పేర్కొంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రజలు తమ  ప్రశంసలు పంచుకోవడానికి "థాంక్యూ జగనన్న" అని టైప్ చేసి 9052690526 నంబర్ కు ఎస్.ఎం.ఎస్ పంపించేలా చూడలని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి. విజయసాయిరెడ్డి పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్డీ కమిటీల ప్రతిపాదనలను జూలై -3 లోపు పంపండి.
పార్టి అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీ బలోపేతం చేసుకోగలమని విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ అనుబంధ విభాగ కమిటీల ప్రతిపాదనలలను జూలై మూడు లోపు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను సమర్పించాలని ఆయన కోరారు. అలాగే పార్టీ(నగర కార్పొరేషన్) కమిటీలకు సంబంధించిన ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని  పార్టి శ్రేణులకు సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget