Vijayamma To YSRCP Plenary: వైసీపీ ప్లీనరికి విజయమ్మ వస్తారా? లేదా? జగన్ పాలనపై ఆమె ఏమంటారు?
వైసీపీ ప్లీనరీకి విజయమ్మ...వస్తారా...రార...జగన్ పాలన పై ఆమె ఎమంటారు...ఎన్ని మార్కులు ఇస్తారు.
![Vijayamma To YSRCP Plenary: వైసీపీ ప్లీనరికి విజయమ్మ వస్తారా? లేదా? జగన్ పాలనపై ఆమె ఏమంటారు? YSRCP Plenery: tension over CM Jagan's mother vijayamma attending to ycp plenary DNN Vijayamma To YSRCP Plenary: వైసీపీ ప్లీనరికి విజయమ్మ వస్తారా? లేదా? జగన్ పాలనపై ఆమె ఏమంటారు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/74b60699e21171b966feb111a07669ce1657169256_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు? సీఎం జగన్ పని తీరుపై ఏమి మాట్లాడతారు. ఈ అంశం కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్లీనరీ సమావేశాలకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది. చాలా కాలంగా విజయమ్మ ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ ప్లీనరీలో విజయమ్మ ఏమి మాట్లాడతారు అనే ఆసక్తి నెలకొంది.
వైఎస్ విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలు.. కానీ 2019 ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీంతో రక రకాల ప్రచారాలు జరిగాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె వైసీపీ ప్లీనరీకి హాజరు అవుతున్నారు. విజయమ్మ కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లో తిరుగుతున్నారు. విజయమ్మ కూడా ఆమెకు సహాయంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. జగన్ కు వీళ్ళకు మధ్య బాగా గ్యాప్ ఉందనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. అయితే ప్లీనరీకి వైఎస్ విజయమ్మ రానుండడంతో ఈ ప్రచారానికి ఇకనైనా తెర పడుతుందా అనేది చూడాలి. విజయమ్మ స్పీచ్‌పై కూడా ఆసక్తి ఏర్పడింది. జగన్ పాలనపై ఏం మాట్లాడతారు? తల్లిగా జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ప్లీనరిలో కార్యకర్తలకు పెద్ద పీట
వైసీపీ ప్లీనరీకి భారీగా కార్యకర్తలు, నేతలు వస్తుండడంతో పక్కాగా ఏర్పాటు చేసున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చ్చిన వారికి అసౌకర్యం కలిగించకుండా వాళ్లు ప్లీనరీలో ఉండడానికి సభా ప్రాంగణంలో ఉండడానికి భోజన వసతులతో సహా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.
ప్లీనరీలో భాగంగా భారీ ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 100 అడుగుల వెడల్పు 80 అడుగుల పొడవు ఉండే విధంగా ఈ వేదికను డిజైన్ చేశారు. మూడు అంచలుగా ప్రధాన వేదిక విభజన జరగనుంది. మొదటి వరసలో సీఎం జగన్ తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు ఉంటారు. రెండవ వరసలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. మూడో వరసలో జిల్లా పరిషత్ చైర్మన్ లు ఉంటారు. మొదటి రోజున రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ వివిధ పదవుల్లో ఉన్న 50 నుండి 60 వేల మంది నేతలు హాజరవుతారు. రెండవ రోజు ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి భారీగా కార్యకర్తలు హజరు కానున్నారు. 5 సంవత్సరాల తరువాత జరుగుతున్న సమావేశంలో అధినేత జగన్ చేసే దిశా నిర్దేశం కోసం కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)