News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Sand Politics : ఏపీలో ఇసుక పై రాజకీయం - టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఎదుుదాడి !

టీడీపీ హయాంలోనే ఎక్కువ ఇసుక దోపిడీ జరిగిందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది. టీడీపీ హయాంలో జరిగిన ఇసుక దోపిడీ వివరాలతో బుక్ లెట్ విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

AP Sand Politics :  ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఇసుక తవ్వకాల పై జగన్ ను  టార్గెట్ గా చేసుకొని ఆందోళనలు చేయటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ   ఎదురు దాడిని ప్రారంభించింది.
 
2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇసుక తవ్వకాలు, అందుకు సంబందించి జరిగిన ఆర్దిక వ్యవహరాలు, పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.  దొంగే దొంగా.. దొంగా అంటే ఎలా అంటూ ప్రత్యేక బుక్ లెట్ ను ప్రచురించింది. ఇసుకను దోచేసిన వారే దోపిడీ అంటున్నారని, కరకట్ట పై చంద్రబాబు ఇంటి వెనుకే ఇసుక దొపిడి చేస్తే కనిపించలేదా అని పార్టీ నాయకులు ప్రశ్నించారు. సర్కార్ ఖజానాకు  సున్నం పెట్టారని..  ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు.  బ్లాక్ మార్కెట్ లోకి పంపి పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకున్నారని ారోపించారు.   చంద్రబాబు పాలన లో పారదర్శకతతో కూడిన ఇసుక Dణువంతయినా లేదని వైఎస్ఆర్ సీపీ మండిపడింది. చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక అవకతవకలకు సంబంధించిన వివరాలు, అప్పటి ఫోటోలతో సహా వివరాలను ప్రచురించారు.

చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక తవ్వకాల విషయంలో అప్పటి శాసన సభ్యుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులను అడ్డుకోవటం, వారి పై దాడులకు పాల్పడిన ఘటన పై వైఎస్ఆర్ సీపీ విడుదల చేసిన బుక్ లెట్ లో ఫోటోలతో సహా ప్రచురించారు. ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో పై దాడికి పాల్పడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాల పై ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయని వాటికి తెలుగు దేశం పార్టీ ఎం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ఇసుక కు విధానం అంటూ లేకుండా చేసి తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు అక్రమాలకు తెర తీశారని, అడిగిన అధికారులను, ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలను బెదిరించి అక్రమ కేసులు పెట్టించి, వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఇసుకాసురుడు అంటూ చంద్రబాబు విమర్శలు చేయటం పై గనులు, విద్యత్, పర్యవరణ శాఖ మంత్రి పెద్ది రెడ్డి ఫైర్ అయ్యారు.  ఇసుక రీచ్ ల దగ్గర తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ధర్నా చేయటం, విడ్డూరంగా ఉందని అన్నారు.  ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కి లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.  చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కూడ మంత్రి పెద్దిరెడ్డి విడుదల చేశారు. 
ఇసుక లో ఒక విధానము లేకుండా చంద్రబాబు చేశారని,  చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ జరిగిందనేని వాస్తవమని పేర్కొన్నారు.  ఇసుక లో లోకేష్ కి నెలకు 500 కోట్లు అందినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.  చంద్రబాబు హయాంలో అక్రమ ఇసుక తవ్వకాల పై NGT 100కోట్లు జరిమానా వేసిందని గుర్తు చేశారు.

చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయని అన్నారు. చంద్రబాబు పేరుతో చెప్పుకోవడానికి ఒక్క పధకం కూడా లేదన్నారు.  హోదాకి బదులు ప్యాకేజ్ తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.  చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తాడు పవన్, లోకేష్ మాట్లాడతారని పెద్ది రెడ్డి అన్నారు.

Published at : 31 Aug 2023 05:40 PM (IST) Tags: AP Politics Minister Peddireddy Sand policy Sand Politics in AP

ఇవి కూడా చూడండి

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?