By: ABP Desam | Updated at : 01 Jun 2023 10:20 AM (IST)
Edited By: jyothi
నేడే రైతు భరోసా నిధులు ( Image Source : Jagan Twitter )
YSR Raithu Bharosa 2023: రైతులకు అందించే పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో సీఎం జగన్ నిధులు జమ చేయనున్నారు. పెట్టుబడి సాయం కింద గతేడాది 51.41 లక్షల మందికి రైతులకు సాయం చేశారు. 2023-24 సీజన్ కు సంబంధించి 52.31 లక్షల మందికి సాయం చేయనున్నారు. వీరికి తొలివిడతగా 7,500 చొప్పున మొత్తం 3,934.25 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే మార్చి, ఎప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టానికి సంబంధించిన అంచనాలను అధికారులు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. వాళ్లకి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. రైతు భరోసా ఇచ్చే వేదికపైనే మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1.61.236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించారని వైసీపీ చెబుతోంది
రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయల అందజేత
వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలను అందిస్తున్నారు. వెబ్ ల్యాండ్ ఆధారంగా అర్హులైన రైతులకు ఈ సాయం అందిస్తున్నారు. కౌలుదారులకు కూడా ఈ డబ్బులు ఇస్తున్నారు. తొలి విడత మేలో, రెండో విడత అక్టోబర్‌లో మూడో విడత జనవరిలో ఇస్తున్నారు. ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుకుంటున్న వారిలో భూ యజమానులు 50,19,187 మంది కాగా, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్లు 91,752 మంది, ఇంకో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 2019–20లో 46,69,375 మంది రైతులు 6,173 కోట్ల రూపాయలు సాయం చేస్తే తర్వాత ఏడాది 51,59,045 మందికి 6,928 కోట్ల రూపాయలు, 2021–22లో 52,38,517 మందికి 7,016.59 కోట్ల రూపాయలు, 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇప్పుడు 52.31 లక్షల మంది తొలివిడతగా 3,934.25 కోట్ల రూపాయలు అందుకోనున్నారు. గత మూడు నెలల్లో కురిసిన అకాల వర్షాలకు 78,510 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు కాగా, 19వేలకుపైగా ఉద్యాన పంటలు పాడైనట్టు అధికారులు లెక్కకట్టారు. ఇలా నష్టపోయిన 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం సాయం చేయనుంది.
22.73 లక్షల మంది రైతులకు రూ.1,965.41 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఏ సీజన్ లో నష్టపోతే అదే సీజన్ ముగియకముందే పంట నష్ట పరిహారం అందిస్తూ బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 78, 830 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 51,468 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన రూ.53.62 కోట్ల పంట నష్ట పరిహారాన్ని పెట్టబడి సాయంతో పాటు బుధవారం జమ చేయనున్నారు. ఈ సాయంతో కలిపి 22.73 లక్షల మంది రైతులకు రూ.1,965.41 కోట్ల ఇన్ పుట్ స్బసిడీని జమ చేసినట్లవుతుంది.
Devineni Uma: వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి
Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Nitin Gadkari: చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్
/body>