By: ABP Desam | Updated at : 29 Mar 2023 01:26 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలోనే సీబీఐ దర్యాప్తు జాప్యంపై సీరియస్ అయిన అత్యున్నత ధర్మాసనం... దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఆలస్యంపై నేడు మరోసారి విచారించింది సుప్రీంకోర్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉన్న శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై కామెంట్స్ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు దర్యాప్తు అధికారితోపాటు మరో అధికారిని నియమించింది. ఆ వివరాలను కోర్టుకు సమర్పించింది సీబీఐ. అయితే విచారణ అధికారిగా రామ్‌సింగ్‌ను కొనసాగిస్తూనే మరో అధికారి పేరు రామ్‌సింగ్‌ను సూచించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పురోగతి లేనప్పుడు ఆయన్నే కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించింది.
ఈ కేసు దర్యాప్తు ఆలస్యమవుతున్న వేళ తన భర్త శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై కూడా కాసేపట్లో ప్రకటన చేయనుంది సుప్రీంకోర్టు.
సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై తులసమ్మ వేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు... విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని, హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ‘విచారణ చేసే అధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ రిపోర్టు మొత్తం చదివామని ధర్మాసనం చెప్పింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదే అని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి చెప్పారు. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఈ హత్య కేసులో ఏ - 5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. దర్యాప్తు వేగంగా జరగడం లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ తులసమ్మ పిటిషన్‌లో కోరారు. గత సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేయగా, దర్యాప్తు పురోగతిపై సీల్డ్ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.
దీంతో దర్యాప్తు పురోగతి, పూర్వాపరాల విషయాలపై నివేదిక దాఖలు చేసినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు. గత సోమవారం వాదనల సందర్భంగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని అడిగింది. తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చింది.
Polavaram Project: పోలవరంలో కుంగిపోయిన గైడ్ బండ్ - సమీక్షించిన జల సంఘం ఛైర్మన్
Top 5 Headlines Today: పోలవరంపై సీఎం జగన్ ఏరియల్ సర్వే! తెలంగాణ కాంగ్రెస్ లోకి ఇద్దరు కీలక నేతలు? టాప్ 5 హెడ్ లైన్స్
Case On AP BJP Leader Devanan : పోస్టింగ్‌ల పేరుతో హోంశాఖ సెక్రటరీ సంతకం ఫోర్జరీ - ఏపీబీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిపై ఢిల్లీలో కేసులు !
Polavaram Project: పోలవరంలో సీఎం జగన్ టూర్- పనుల జరుగుతున్న తీరుపై ఏరియల్ సర్వే
అన్ని పార్టీలతో స్నేహమంటే సొంతంగా ఎదిగే స్కోప్ ఏదీ? ఏపీ బీజేపీలో అంతర్మథనం
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- ఈ నెలలోనే జాయినింగ్స్!
Swara Bhaskar Pregnancy : తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి - పెళ్ళైన మూడు నెలలకే గుడ్ న్యూస్
LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం
Deepika Pilli HD Images : దీపికా పిల్లి - ఫోజులిస్తూ నవ్వింది మళ్ళీ మళ్ళీ