అన్వేషించండి

YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల

Andhra Pradesh News | గత ప్రభుత్వం లో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఎందుకు చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నాడు జగన్ అమ్ముడుపోయారు, ఇప్పుడు చంద్రబాబు అమ్ముడుపోయారా అని ప్రశ్నించారు.

అమరావతి: ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వైసీపీ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అక్రమ డీల్‌పై నిజాలు నిగ్గుతేల్చండి..

రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. గత ప్రభుత్వంలో అదానీతో జరిగిన అక్రమ డీల్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదు..! అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజనిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. నాడు జగన్ అమ్ముడుపోయినట్లుగా, ఇప్పుడు మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ సీఎంతో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై మీరు నోరు విప్పకుండా, విచారణ చేయకుండా ఉండేందుకు అదానీ మీకు లంచాలు ఎంత ఆఫర్ చేశారు? అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ఐదేళ్లపాటు SECIతో చేసుకున్న జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లే అని ఆరోపించారు. గుజరాత్ లో రూ 1.99 పైసలకు దొరికే సోలార్ విద్యుత్ ను గత వైసీపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొంటుందని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. జగన్ సర్కార్ నిర్ణయం అదానీ కోసం ప్రజలను నిలువునా దోచి పెట్టడం అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా గతంలో హైకోర్టులో కేసు కూడా వేపించారు. అధికారంలో వచ్చాక నిజాలు తేలుస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు ? అన్ని ఆధారాలు దన్నా, అధికారం పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ - వైఎస్ షర్మిల 

అప్పుడు జగన్, ఇప్పుడు మీరు అమ్ముడుపోయారా?
ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే నాడు వైసీపీ హయాంలో జగన్, అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారనే అర్థం వస్తుందన్నారు షర్మిల. అదానీ మీకు కూడా లంచాలు ఇచ్చి, మిమ్మల్ని కూడా తక్కెడలో నిలబెట్టారనే కదా అర్థం అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఒకలా, ఇప్పుడు అధికారం ఉన్నా మరోలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒకవేళ అదానీ మిమ్మల్ని కొనకపోతే, ఆయనతో వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ఏసీబీని రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. రూ.1750 కోట్ల ముడుపుల ఆరోపణలపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని, గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను తక్షణం రద్దు చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget