అన్వేషించండి

YS Sharmila: పెద్ద కోటల్లో జగన్, ఎన్నికల కోసమే బయటికి - ఆయన మనకి అవసరమా: షర్మిల

AP Elections 2024: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజక వర్గంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు. జగన్ పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారని షర్మిల విమర్శించారు.

YS Sharmila in Madakasira: ఎన్నికలు ఉన్నాయని జగన్ సిద్ధం అంటూ బయటకు వస్తున్నారని... పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజల సమస్యలు ఏనాడైనా విన్నారా? అని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు  వైఎస్ఆర్ హయంలో 90 శాతం పూర్తి అయిందని వైఎస్ షర్మిల అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కట్టలేదని జగన్ ఎద్దేవా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో వస్తే ప్రాజెక్ట్ పూర్తి చేసి 127 చెరువులకు నీళ్ళు ఇస్తానని జగన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. దాని ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారని.. అధికారంలో వచ్చాక ప్రాజెక్ట్ పట్టించుకునేవారే లేరని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజక వర్గంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు.

‘‘ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు. ఒక్క పరిశ్రమ రాలేదు. రఘువీరా హయాంలో భూ సేకరణ జరిగింది. భూములు ఉన్నా పరిశ్రమలు రాలేదు. లేదర్ పార్క్ అన్నాడు. మరిచారు. మడక శిర నియోజక వర్గం చుట్టూ రింగ్ రోడ్ అన్నారు...మరిచారు. గత 10 ఏళ్లుగా ఈ నియోజక వర్గాన్ని TDP, YCP మోసం చేసింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవని. హోదా వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది. అయినా బీజేపీ తో బాబు, జగన్ పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నారు. 

బాబు పొత్తు.. జగన్ తొత్తు
పొత్తులు, తొత్తులకు ఓటు వేయడం అవసరమా? బీజేపీకి గులాం గిరీ చేస్తున్నారు. బీజేపీకి బానిసలుగా మారారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. బాబుకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. జగన్ కి ఓటు వేసినా బీజేపీ ఓటు వేసినట్లే. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన బీజేపీ, బాబు, జగన్ లు ఈ రాష్ట్రానికి అవసరమా? హోదా ఇవ్వని, మోసం చేసిన ఈ పార్టీలు మనకు అవసరమా? ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. హోదా 10 ఇస్తామని AICC మ్యానిఫెస్టోలో పెట్టింది.

రాష్ట్రంలో అధికారంలో వస్తే మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే ఉంటుంది. 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ మీదనే తొలి సంతకం. ప్రతి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇండ్లు కట్టిస్తం. ఏడాదికి పెద్ద మహిళకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. వృద్దులకు 4 వేలు, వికలాంగులకు 6 వేలు పెన్షన్ ఇస్తాం. గత 10 ఏళ్లు బాబు, జగన్ పాలన చూశారు. కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి. YSR పాలన మళ్ళీ తీసుకువద్దాం. మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓటు వేయాలి.

ఎన్నికలు ఉన్నాయని జగన్ సిద్ధం అంటూ బయటకు వస్తున్నారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారు. ప్రజల సమస్యలు ఏనాడైనా విన్నారా? వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేది. వారసుడు పాలనలో ఎక్కడ పోయింది దర్బార్? మడకశిర ఎమ్మెల్యేగా సుధాకర్ ను గెలిపించాలని, ఎంపీ గా సమద్ షాహిన్ ను గెలిపించాలని కోరుతున్నా’’ అని వైఎస్ షర్మిల అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget