(Source: ECI/ABP News/ABP Majha)
YS Jagan : శుక్రవారం వినుకొండకు వైఎస్ జగన్ - శవరాజకీయాలంటూ టీడీపీ తీవ్ర విమర్శలు
Andhra Prdesh : వైఎస్ జగన్ శుక్రవారం వినుకొండకు వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే శవరాజకీయం చేస్తున్నారని టీడీపీ మండిపడింది.
YS Jagan will go to Vinukonda on Friday : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుకొండలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు వినుకొండ నేతలకు వైసీపీ హైకమాండ్ సమాచారం ఇచ్చింది. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. రషీద్ వైసీపీ కార్యకర్త అని.. పార్టీ కోసం చురుగ్గా పని చేస్తున్నారన్న కారణంగా నరికి చంపేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. వ్యక్తిగత కక్షల వల్ల ఈ హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు కానీ అది రాజకీయ దాడేనని వైసీపీ అంటోంది. అందుకే బెంగళూరులో ఉన్న జగన్ గురువారమే ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. బెంగళూరు నుంచేపార్టీ నేతలతో చర్చించిన తర్వాత .. వినుకొండ పర్యటనను ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
జగన్ వినుకొండ పర్యటనపై టీడీపీ మండిపడింది. శవ రాజకీయం చేసి పార్టీ భూస్థాపితం అయ్యింది. అయినా ఈ శవ రాజకీయం ఆపటం లేదు. ఫేక్ ప్రచారాలతో, రాష్ట్రం పై పడి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తూ ఓడించిన రాష్ట్రం పై పగ తీర్చుకుంటున్నాడని టీడీపీ మండిపడింది.
v
తండ్రి శవం అడ్డు పెట్టుకుని పార్టీ పుట్టింది, బాబాయ్ శవం అడ్డు పెట్టుకుని పార్టీ ఎదిగింది, అమాయకురాలైన గీతాంజలి చావు అడ్డు పెట్టుకుని శవ రాజకీయం చేసి పార్టీ భూస్థాపితం అయ్యింది. అయినా ఈ శవ రాజకీయం ఆపటం లేదు. ఫేక్ ప్రచారాలతో, రాష్ట్రం పై పడి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తూ,… pic.twitter.com/Is48gDDlKs
— Telugu Desam Party (@JaiTDP) July 18, 2024
v
వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందన్న పోలీసులు
వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నేత రషీద్ పై ప్రత్యర్థి జిలానీ బుధవారం రాత్రి దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహతంగా పొడిచి చంపేశాడు. కత్తి దాడిలో చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా రషీద్ ను ప్రత్యర్థి జిలానీ హత్య చేశాడు. రషీద్ ప్రభుత్వ లిక్కర్ షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే వైసీపీ లో చురుకుగా తిరుగుతూ ఉంటాడు. గతంలో జిలానీ కూడా వైసీపీలోనే ఉండేవారు. ఇద్దరూ స్నేహితులే. తర్వాత గొడవలు వచ్చాయి. ఇటీవల జిలానీ బైక్ తగలబడింది. దానికి కారణం రషీద్ అని కోపం పెంచుకుని జిలానీ కత్తితో దాడిచేశాడు. ఓవైపు చట్టుపక్కల ఉన్నవారు వద్దని వారిస్తున్నా, నిందితుడు ఏమాత్రం పట్టించుకోలేదు. జిలానీ కత్తి దాడిలో చేతి తెగిపోయి, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే రషీద్ చనిపోయాడు. ఈ దారుణహత్యతో స్థానికంగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితుడ్ని వినుకొండ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
అయితే రాజకీయ కక్షలతోనే అరెస్ట్ చేశారని అంటున్న వైసీపీ.. ఈ అంశంపై రంగంలోకి దిగాలని జగన్ నిర్ణయించుకున్నారు.