అన్వేషించండి

YS Jagan Support CJP : CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !

YS Jagan Tweet CJP Leaders: కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ అరెస్ట్‌ను ఖండిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేశారు.

Cockroach Janata Party Sourav Das Arrest: కాక్రోచ్ జనతా పార్టీ  నేతల అరెస్టుల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ తీరు తెన్నులపై ఘాటు విమర్శలు గుప్పించిన ఆయన, సిజేపీ నేతలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతా జరిగిపోయిన తర్వాత అధికారులతో విచారణలు జరిపించడం, కంటితుడుపు చర్యలకు దిగడం కంటే, నష్టం జరగక ముందే వ్యవస్థలు జాగ్రత్త పడటం ఎంతో మంచిదని జగన్ హితవు పలికారు. ప్రక్షాళన చేయాల్సింది రాజకీయ నేతలను కాదని, లోపభూయిష్టంగా మారిన ఎన్నికల వ్యవస్థనే అని ఆయన ఎక్స్ వేదికగా తేల్చిచెప్పారు.

CJP కీలక నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం అరెస్టులు, అణచివేత చర్యలతో ఏమీ సాధించలేరని, ఇటువంటి చర్యల వల్ల పరిస్థితి సర్దుమణగకపోగా మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే వ్యవస్థలపై ప్రజల్లో ఉన్న మిగిలిన కాస్త నమ్మకం కూడా పూర్తిగా ఆవిరైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన అశుతోష్, సౌరవ్ దాస్‌లకు తన సానుభూతిని తెలియజేస్తూ ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించడం వల్లనే ఈ తరహా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని జగన్ తన ట్వీట్‌లో విశ్లేషించారు.  ప్రస్తుతం మన వ్యవస్థలోనే పెద్ద లోపం ఉంది. ఎన్నికల వ్యవస్థపై పౌరుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉంది. అంతేగానీ ప్రశ్నించే గొంతులను జైలుపాలు చేయడం పరిష్కారం కాదు  అని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ,  ప్రభుత్వ యంత్రాంగాలు పక్షపాత వైఖరిని వీడి, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.   

సిజేపీ నేతలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది. జగన్ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ సిజేపీ సీనియర్ నేతలు అభిజిత్ దీప్కే, అజింక్య షిండేలు ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో తమ పోరాటానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలవడం భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కొత్త ఊపిరి పోసిందని వారు పేర్కొన్నారు. 

  కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్టు వ్యవహారంపై జగన్ స్పందించిన తీరు జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయాలకు దర్పణం పడుతోంది.  ఒకవైపు ఎన్నికల వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూనే, మరోవైపు ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను జగన్ బట్టబయలు చేశారు. దీంతో  ఇండీ కూటమితో కలిసి ఎన్నికల వ్యవస్థపై పోరాటానికి ఆయన ముందడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget