News
News
X

YS Jagan Kadapa Tour: 2 రోజులపాటు కడప జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్

AP CM YS Jagan to visit YSR Kadapa District: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 7,8 తేదీలలో ఉమ్మడి కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

FOLLOW US: 

జూలై 7, 8న వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్  
రేపు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం
జూన్ 8న ఉదయం వైఎస్సార్‌కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి,
అనంతరం విజయవాడ చేరుకుని పార్టీ ప్లీనరీలో పాల్గొననున్న సీఎం

ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7,8 తేదీలలో ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేసింది.

జూలై 7న సీఎం జగన్ షెడ్యూల్‌
ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్‌ చేరుకుంటారు, అక్కడ న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు వేంపల్లి చేరుకుంటారు. 3.30 గంటలకు డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక పార్క్‌కు చేరుకుని పార్క్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధిని, విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 

జూలై 8న షెడ్యూల్‌
ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో సీఎం జగన్ పాల్గొననున్నారు.భద్రత కట్టుదిట్టం..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కడప కలెక్టర్‌ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పేర్కొన్నారు. కడప – పులివెందుల బైపాస్‌ రోడ్డులో సీఎం ల్యాండ్ కానున్న హెలీప్యాడ్‌ స్థలాన్ని ఉన్నతాధికారులు మంగళవారం సందర్శించారు. సీఎం జగన్ కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌కుమార్, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ, డీఎస్పీ, ఎంపీపీ, మండల ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్, విద్యుత్‌ శాఖ డీఈ శ్రీకాంత్, ఎమ్మార్వో పలు శాఖల అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

Also Read: Vijayawada: బార్లు, వైన్ షాపుల్లో అవి త‌ప్ప‌కుండా పెట్టాల్సిందే! ఓనర్లకి బెజ‌వాడ పోలీసుల వార్నింగ్

Published at : 06 Jul 2022 03:01 PM (IST) Tags: YSRCP YS Jagan Mohan Reddy AP CM YS Jagan AP News

సంబంధిత కథనాలు

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

విధ్వంసాలకు మారుపేరు జగన్ : అచ్చెన్నాయుడు

విధ్వంసాలకు మారుపేరు జగన్ : అచ్చెన్నాయుడు

CJI Ramana : విజయవాడలో కొత్త కోర్టు భవనాలు - శనివారం ప్రారంభించనున్న సీజేఐ !

CJI Ramana : విజయవాడలో కొత్త కోర్టు భవనాలు - శనివారం ప్రారంభించనున్న సీజేఐ !

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

AP Agri Gold  :   ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్