Mekapati Gautam Reddy: గౌతం రెడ్డి హఠాన్మరణంపై ఉపరాష్ట్రపతి సహా పలువురి దిగ్భ్రాంతి, కాసేపట్లో హైదరాబాద్‌కు సీఎం జగన్
Minister Mekapati Gowtham News: మేకపాటి మరణ వార్త తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. కాసేపట్లో ఆయన అపోలో ఆస్పత్రికి చేరుకోనున్నారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడాన్ని రాజకీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకొని రాజకీయ ప్రముఖులతోపాటు, ఆయన సన్నిహితులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. కాసేపట్లో ఆయన అపోలో ఆస్పత్రికి చేరుకోనున్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు. శ్రీ గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు. pic.twitter.com/XKj0APsHLU
— Vice President of India (@VPSecretariat) February 21, 2022
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/zyZZuVBgLe
— N Chandrababu Naidu (@ncbn) February 21, 2022
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కలచివేసిందని.. ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడి మృతి బాధాకరమని సహచర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్వీట్ చేశారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానని.. ఆయన హఠాన్మరణం చాలా బాధకరమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
గౌతమ్ రెడ్డి వివాదాలకు దూరమని.. తనకు బంధువని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తన బంధువు నిశ్చితార్థ కార్యక్రమంలో రాత్రే కలిశానని అన్నారు. మచ్చ లేకుండా మంత్రిగా పని చేశారని.. అలాంటి గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న వార్త నన్ను బాగా బాధించిందని అన్నారు.
‘‘చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం. నిన్నటి వరకు ఏపీలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించారు. మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు’’ అని మంత్రి ఆళ్ల నాని అన్నారు.
‘‘నాకు ఫ్రెండ్ అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణవార్త విని చాలా బాధకు గురయ్యాను. ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Deeply saddened & shocked beyond belief to learn about the sudden demise of dear friend @MekapatiGoutham Garu
— KTR (@KTRTRS) February 21, 2022
My heartfelt condolences to the family & friends in this hour of grief
Gone too soon brother. Pray that you rest in peace 🙏 pic.twitter.com/9V7IYk3o03
‘‘ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అకాల మరణం నన్ను కలచివేసింది. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్ను మూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్వీట్ చేశారు.