అన్వేషించండి

Parthasaradhi : శుక్రవారం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి భేటీ - టీడీపీలో చేరికపై చర్చించే అవకాశం !

YCP MLA : వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి శుక్రవారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలవనున్నారు. పార్టీలో చేరిక అంశంపై చర్చించనున్నారు.


YCP MLA Kolusu Parthasaradhi :  మాజీ మంత్రి, పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి  టీడీపీలో చేరనున్నారు. శుక్రవారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్థసారధిని పెనుమలూరు నుంచి కాకుండా నూజివీడు లేదా మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు. అయితే సీనియర్ ని అయనను ఏ మాత్రం గౌరవించడం లేదని.. గుర్తించడం లేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్థసారధి అసంతృప్తిని గుర్తించిన సీఎం జగన్ ఆయనను పిలిపించుకుని మాట్లాడారు  పార్టీని వీడొద్దని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ మారిపోవాలనే ఆయన నిర్ణయించుకున్నారు. 

వైసీపీ సాధికార బస్సు యాత్రలో పార్థసారథి ఇటీవల అందరిముందు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఊహాగానాలకు కారణమయ్యాయి. ఆయన పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.    విజయవాడలోని తన కార్యాలయంలో మంగళవారం రాత్రి టీడీపీనేతలతో  పార్థసారథి భేటీ అయ్యారు. తెదేపాకు చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం తెదేపా నేత బొమ్మసాని సుబ్బారావులు వచ్చి సారథితో చర్చించారు. సారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈనెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి  టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది.             

పార్థసారధితో పాటు ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, రక్షణ నిధి కూడా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా పార్థసారధితో పాటు పార్టీ మారుతారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. వారు పార్టీ మారకుండా.. సీఎంవోకు రావాల్సిందిగా పిలుపులు వెళ్లాయి. అయితే  ఎమ్మెల్యే రక్షణ నిధి మాత్రం తాను వచ్చేది లేదని చెప్పినట్లుగాతెలుస్తోంది.                                                                         
 
పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్శిటీ శాఖల మంత్రిగా పని చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2014లో ఓటమి పాలయిన పార్థసారథి...2019లో వైసీపీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి పోటీ చేసి...టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పై 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget