అన్వేషించండి

YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !

Venkatesh Reddy Arrest : వైసీపీ నేత వెంకటేష్ రెడ్డిని పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్‌సీపీ ఇంకా స్పందించలేదు.


YSRCP Leader Arrest in US :  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్‌సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు.   అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్‌ చేయడం సహా అనేక నేరాల కింద కేసు నమోదు చేశారు.  ఇరవై ఏళ్ల యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.

సెయింట్ చార్లెస్ కౌంటిలోని ఓ ఇంట్లో యువకుడ్ని హింహిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వాళ్లు పోలీసుల్ని లోపలికి మొదట అనుమతించలేదు. తర్వాత పోలీసులు బలవంతంగా వెళ్లి చూడటంతో ఓ యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు తెలుగు యువకుల్ని అరెస్టు చేశారు. పెనుమచ్చ శ్రబన్, పెన్మత్స నిఖిల్ అనే వారిని అరెస్టు చేశారు. బాధితుడ్ని హింసిస్తున్న అసలు వ్యక్తి సత్తారు వెంకటేష్ రెడ్డి అని గుర్తించి అతడ్ని వెరే ఇంట్లో అరెస్టు చేశారు. ముగ్గుర్నీ జైలుకు తరలించారు.

బాధిత యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి వెట్టి చారికి చేయిస్తున్నాడు సత్తారు వెంకటేష్ రెడ్డి. అన్ని రకాల పనులను చేయించుకునేవాడు. మూడుగంటల కన్నా ఎక్కువ నిద్రపోనిచ్చేవాడు కాదని పోలీసులు ప్రకటించారు.  సరైన తిండి పెట్టేవాడు కాదు. కటిక నేత మీద పడుకోమని చెప్పేవాడు. తనపై ఎప్పుడూ సీసీ కెమెరా నిఘా పెట్టి ప్రతి పనిలోనూ తప్పును వెదికి దండించేవాడని పోలీసులు తెలిపారు. 

అయితే ఆ యువకుడికి అమెరికాలో ఎవరూ తెలియదు. చివరికి ఓ పొరుగు వ్యక్తి పరిస్థితిని గమనించాడు. ఏమైనా సాయం కావాలంటే చెప్పాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తనను ఇలా హింహిస్తున్నారని చెప్పడంతో ఆ పొరుగు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితుడ్ని కాపాడారు. నిందితులు ముగ్గుర్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిపై హ్యూమన్ ట్రాఫికింగ్ తో పాటు , బానిసత్వం చేయించుకునేందుకు అక్రమ రవణా, దాడిచేయడం, కిడ్నాప్ చేయడం, గృహ హింస, క్రిమినల్ చర్య వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసి జైల్లో వేశారు.

వెంకటేష్ రెడ్డి తనను తాను చాలా పవర్ ఫుల్ అని అమెరికాలో ప్రచారం చేసుకుంటారు. తాను వైసీపీ నేతనని సీఎం జగన్ బంధువునని ప్రచారం చేసుకుంటారు. తాడేపల్లిలో  సీఎం జగన్  గృహప్రవేశ సమయంలో ఆయన పాల్గొన్న దృశ్యాల ఉన్నాయి. అలాగే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో నూ ఆయన సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి.   ఆయన తాను వైసీపీకి పని చేస్తున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. పలు వైసీపీ కార్కక్రమాల్లోనూ పాల్గొన్న వీడియోలను తన వెబ్ సైట్ లో పెట్టుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget