అన్వేషించండి

APBJP : ఏపీబీజేపీలో గందరగోళం - పురందేశ్వరి తీరుపై సంప్రదాయ బీజేపీ నేతల అసంతృప్తి !?

ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది ? పురందేశ్వరి తీరుపై సంప్రదాయ బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారా ?


APBJP :  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మొదటి నుంచి పార్టీలో ఉన్న బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ తరపున ఒక్కరూ మాట్లాడటం లేదు. సోము వీర్రాజు దగ్గర్నుంచి  కొత్తగా చేరిన కిరణ్ కుమార్ రెడ్డి వరకూ చాలా మంది కీలక నేతలు ఉన్నా.. అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చొరవ తీసుకోవడం లేదు. పూర్తి స్థాయిలో వారు సైలెంట్ గా ఉండటంతో.. బీజేపీ క్యాడర్ గందరగోళంలో పడిపోయింది. 

పురందేశ్వరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా ?

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సోము వీర్రాజును హఠాత్తుగా తొలగించి పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారు.  పురందేశ్వరి జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పరిమితంగానే ఉన్నారు. ఆమెను రాష్ట్ర అధ్యక్షురాలిగా చేస్తారని ఎవరూ అనుకోలేదు. హైకమాండ్ ఏం సమీకరణాలు చూసిందో కానీ  ఆమెకు బాధ్యతలు అప్పగించారు. కార్యవర్గాన్ని నియమించే వరకూ కాస్త యాక్టివ్ గానే ఉన్న పార్టీ ఆ తర్వాత ఒక్క సారిగా సైలెంట్ అయిపోయింది. చాలా మంది సీనియర్ నేతలు.. పార్టీ కోసం తమ వాయిస్ ను మీడియాలో వినిపించేవారు కామ్ అయిపోయారు. పురందేశ్వరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అసంతృప్తి వారిలో ఉందని చెబుతున్నారు.  ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే జీవీఎల్ నరసింహారావు కూడా ఇటీవలి కాలంలో నోరు మెదపడం లేదు. . ఆయన కూడా పురందేశ్వరి తీరుపై సంతృప్తిగా లేరని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

జనసేనను కలుపుకునేందుకు ప్రయత్నం చేయడం లేదని కొందరు అసంతృప్తి ! 

జనసేన పార్టీ బీజేపీతో అధికారిక పొత్తులో ఉంది.  ఇటీవల పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లుగా కనిపించాయి.  బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కూడా మిత్రుడేనని కలిసి మాట్లాడతామని ప్రకటించారు. తర్వాత జనసేన పార్టీ.. బీజేపీ నిర్వహించిన ధర్నాల్లో పాల్గొన్నారు. ఇక జనసేన, బీజేపీ కలిసి ఉద్యమాలు చేస్తాయనుకున్నారు. కానీ హఠాత్తుగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు మారిపోయాయి. చంద్రబాబు అరెస్టును బీజేపీ వ్యతిరేకించింది. జనసేన ఇంకా తీవ్రంగా స్పందించింది. అయితే అదే రోజు పవన్ కల్యాణ్ ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ బీజేపీ వైపు నుంచి పవన్ కు ఎలాంటి మద్దతు రాలేదు. తర్వాతి రోజు .. పవన్ ఏపీకి రావాలంటే పాస్ పోర్టు అక్కర్లేదని ఓ వాక్యంతో  పురందేశ్వరి సపోర్ట్  చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు వెంటనే స్పందించి.. పవన్ ను అరెస్ట్ చేస్తే పది గంటల తర్వతా స్పందించడం   మద్దతు పలకడంలాగా లేదని.. జనసేన వర్గీయులు కూడా సోషల్ మీడియాలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.  

టీడీపీతో పొత్తు కోసమేనా ?

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశం ఉంది.  ఈ అంశంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. కానీ క్లారిటీ లేదు. వైసీపీ కూడా బీజేపీకి  బాగా దగ్గరగా ఉంది.  వైసీపీని  బీజేపీ దూరం చేసుకుని.. టీడీపీకి దగ్గరవుతుందా లేదా అనే సందేహం ఉంది. అయితే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనతోనే పురందేశ్వరి నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ సంప్రదాయ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై పురందేశ్వరి మాత్రం ఖండించారు ఇంకెవరూ మాట్లాడలేదు.  అయితే ఏపీ బీజేపీ ఉపాద్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి చంద్రబాబు అరెస్టును ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్  బీజేపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో ఖండించారు. కానీ అదే ట్వీట్‌లో...  మీరు అవినీతి పరులపైవే ఉంటారా అని కూడా సెటైర్ వేశారు. దీని ద్వారా సంప్రదాయ బీజేపీ నేతలకు..  అరెస్టు విషయంలో చంద్రబాబుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా లేరన్న వాదన వినిపిస్తోంది. అంతిమంగా  ఈ వ్యవహారం ఏపీ బీజేపీలో తీవ్ర చర్చకు కారణం అవుతోంది. ఇప్పటికే హైకమాండ్‌కు కొంత మంది నేతలు  తమ అసంతృప్తివి  వ్యక్తం చేశారని చెబుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget