Weather Updates: గత 5 ఏళ్ల కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికం - ఏపీ, తెలంగాణలో మొదలైన ఉక్కపోత
Temperature in Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది.
![Weather Updates: గత 5 ఏళ్ల కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికం - ఏపీ, తెలంగాణలో మొదలైన ఉక్కపోత Weather Updates: Dry Weather in Telangana and Andhra Pradesh On 13th March 2022 Weather Updates: గత 5 ఏళ్ల కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికం - ఏపీ, తెలంగాణలో మొదలైన ఉక్కపోత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/0265f9cfb2f134507417ff9700f1325c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, మరోవైపు రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి పూట ఎండ ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత అధికం కానుంది. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 32.8 డిగ్రీలు, నందిగామలో 38.4 డిగ్రీలు, నెల్లూరులో 34 డిగ్రీలు, తునిలో 36.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 34 డిగ్రీలు, అమరావతిలో 36.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి దిగువన నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికం అవుతుంది. అనంతపురంలో 36.8 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 34.5 డిగ్రీలు, తిరుపతిలో 34.9 డిగ్రీలు, కర్నూలులో 37.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
Daily weather report for Andhra Pradesh Dated 12.03.2022. pic.twitter.com/0WGSpCM8tL
— MC Amaravati (@AmaravatiMc) March 12, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Temperature in Telangana)
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నల్గొండలో 39 డిగ్రీలు నమోదు కాగా, భద్రాచలంలో 37.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 37.3 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత అధికం. నేటి నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని అంచనా వేశారు.
Also Read: Gold-Silver Price: బంగారం - వెండి ధరలపై ఇంకా యుద్ధం ఎఫెక్ట్! నేడు కూడా ఎగబాకిన ధరలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)