Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్... వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో వర్షాలు
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: Horoscope Today :ఈ రాశులవారి ప్రత్యర్థులు షార్ప్ గా ఉంటారు...మీరు జాగ్రత్త పడాల్సిందే..
నమోదైన వర్షపాతం
ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం సూచించింది. ఏపీలో గురువారం కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో వెంకటగిరిలో 6.1 సెం.మీ, తవనంపల్లెలో 5.1సెం.మీ, గోరంట్లలో 4.9సెం.మీ, కృత్తివెన్నులో 4.6,నూజివీడులో 4.5, తాడేపల్లిగూడెంలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలా? తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొంది. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది.
రాష్ట్రంలో గురువారం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున పలు చోట్ల వర్షం కురిసింది.
Also Read: India on Covid Vaccination: దేశంలో 50 శాతం మందికి ఫస్ట్ డోస్ టీకా.. కేంద్ర మంత్రి వెల్లడి