By: ABP Desam | Updated at : 08 Oct 2021 07:26 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
గులాబ్ తుపాను తర్వాత గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొంటోంది. అయితే, ఈ నెల 10న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏపీ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని.. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో అల్పపీడనం వల్ల మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి
వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
Also read: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది
రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది.
Also Read: ప్యాకెట్ పాలను మరగబెట్టాల్సిన అవసరం ఉందా? నేరుగా తాగొచ్చా?
తెలంగాణలో వాతావరణం ఇలా..
గురువారం (అక్టోబరు 7)న హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాగల 24 గంటల్లో వాతావరణం ఇలా ఉంటుంది. ‘‘తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలుక అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుంది.’’ అని వివరించారు. వర్షాలకు సంబంధించి అధికారులు హెచ్చరికల్లాంటివి ఏమీ విడుదల చేయలేదు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల
Gold-Silver Price: ఇవాల్టి బంగారం ధరల్లో కాస్త ఊరట! రూ.250 తగ్గిన రేటు, వెండి కూడా దిగువకు
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!
Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం