By: ABP Desam | Updated at : 08 Jan 2023 06:50 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తర భారత దేశాన్ని గత వారం పాటు గజగజ వణికించిన చలి, ఇప్పుడు నేరుగా దక్షిణ భారత దేశం వైపుగా వస్తోంది. దీని వలన తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అలాగే మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్ర రూపాన్ని దాల్చనుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సాయంకాలం 4 గంటల నుంచే చలి ప్రారంభించి, తెల్లవారుజామున 10 వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చల్లటి వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రదేశాల్లో 5 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే పరిస్ధితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
విశాఖ నగరంలో 15 నుంచి 17 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలని ఎదురు చూడవచ్చు. అలాగే కాకినాడ, కొనసీమ, కృష్ణా, ఎన్.టీ.ఆర్. , గుంటూరు, పల్నాడు, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత ఉంటుంది. విజయవాడలో 13 నుంచి 15 మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండనుంది. ప్రకాశం జిల్లాలో కూడ చలి తీవ్రత ఉంటుంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడ చలి తీవ్రత ఉండనుంది. నంద్యాల జిల్లాలో అత్యధిక చలి తీవ్రత అత్యథికంగా ఉండనుంది. కడప, అన్నమయ్య, కర్నూలు, అనంత, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కూడ చలి తీవ్రత ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం చలి సాధారణంగా ఉంటుంది. రాయలసీమకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మిగిలిన భాగాల్లో ఉండదు.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ, తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 26.2 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
All India Couple Tour : ఆల్ ఇండియా కపుల్ టూర్, సైకిల్ పై రాష్ట్రాలు దాటుతున్న పశ్చిమ బెంగాల్ జంట
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
CM Jagan Mohan Reddy : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్, తలసేమియా బాధితుడికి తక్షణ సాయం
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Upcoming Movies This Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!