Weather Updates: ఆ రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం, కారణం ఏంటంటే

AP Weather: మార్చి 4, 5న మాత్రం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

FOLLOW US: 

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.

కానీ, మార్చి 4న మాత్రం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని ప్రకటించారు. మార్చి 5వ తేదీన కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని వెల్లడించారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.

View this post on Instagram
 
A post shared by Amaravati AP (@mc_amaravati)

‘‘బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారుతోంది. ఇది మెల్లగా ఉత్తర తమిళనడు వైపుగా కదలనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని ప్రభావం మన రాష్ట్రంలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మెల్లగా మొదలవ్వనుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మార్చి నాలుగు నుంచి అంతగా వర్షాలు ఉండవు. కానీ కొంచెం గాలులు, కొన్ని వర్షాలు, మేఘావృతమైన ఆకాశం తప్పకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో ఏర్పడే ఎటువంటి అల్పపీడనాలు అయినా తక్కువగా అంచనా వేయొచ్చు. వీటి వల్ల వరదలు రావు. మన రాష్ట్రంలోని తమిళనాడు పరిశర ప్రాంతాల్లో కొంచం ఎక్కువ ప్రభావం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది. ఉదయం సమయంలో అక్కడక్కడా పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉంది. వచ్చే 24 గంటల్లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.

Published at : 03 Mar 2022 07:42 AM (IST) Tags: rains in telangana Weather Updates Weather in Andhrapradesh Weather in Hyderabad rain in hyderabad weather in ap telangana

సంబంధిత కథనాలు

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?