Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్
ఏపీలో ప్రస్తుతం కాస్త దిగువన తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడు వైపు కదులుతోందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. తమిళనాడుపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం కాస్త దిగువన తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనుండగా.. వీటి ఫలితంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఏపీలో చలి పెరుగుతుందని చెప్పారు.
అదంతా ఫేక్ తుపాను నమ్మొద్దు - ఏపీ వెదర్ మ్యాన్
‘‘డిసెంబరు మొదటి వారంలో దక్షిణాంధ్రలో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వరకు మాత్రమే ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారి దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు వైపుగా వస్తోంది. దీని వలన డిసెంబరు 1 నుంచి నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. నెల్లూరు నగరంలో కూడ కొన్ని వర్షాలుంటాయి. డిసెంబరు 2 నుంచి 4 మధ్యలో తిరుపతి జిల్లాలోని అన్ని భాగాలు ముఖ్యంగా తిరుపతి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. అన్నమయ్య, ప్రకాశం కోస్తా భాగాల్లో కూడా, చిత్తూరు జిల్లాలోని కొన్ని వర్షాలను చూడగలము. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప జిల్లాలో తక్కువగానే వర్షాలుండనున్నాయి.
మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం ఉండదు. విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రిలో కూడా వర్షాలు ఉండవు. ముఖ్యమైన గమనిక - విండీ యాప్ లో ఏదో తుఫాను ఆంధ్ర వైపుగా చూపిస్తూ ఉందని ఫేక్ న్యూస్ ఛానల్స్ చాలా దారుణంగా భారీ తుఫాన్ అని మరో పది రోజుల వరకు ఫేక్ న్యూస్ ని చెప్పనున్నారు. వాస్తవానికి ఈ సమయంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రా వైపుగా రావడం చాలా అరుదు. ఇంకా చాలా సమయం ఉంది. దయజేసి విండీ ఆప్, ఫేక్ న్యూస్ గాలులను నమ్మి భయపడకండి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 28) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని అంచనా వేశారు. సాధారణం కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. వచ్చే రెండు రోజులు చలి మరింత పెరుగుతుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో క్లియర్ స్కైట్. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 3 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.
నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 27, 2022