Weather Updates: ఈ ప్రాంతాల్లో మరింత పెరగనున్న వేడి, ఎండ! ఇక చలి పూర్తిగా తగ్గినట్లే
AP Telangana Weather News: ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో ప్రధానంగా ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని IMD వెల్లడించింది.
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం (Weather Updates) పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ (Hyderabad Weather) కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో (Andhrapradesh Weather) ప్రధానంగా ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (AP Weather Updates) రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో (AP Weather News) వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.
Synoptic features of weather inference and weather warnings for Andhra Pradesh in Telugu dated 26.02.2022 https://t.co/qQTnyy3B9l
— MC Amaravati (@AmaravatiMc) February 26, 2022
‘‘రానున్న 10 రోజుల వాతావరణ అంచనాల ప్రకారం.. కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అతి త్వరలో 38 నుంచి 39 డిగ్రీలకు ఎగబాకనుంది. ఇంకొన్ని చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. పొగమంచు, చలి పూర్తిగా తగ్గిపోయింది. పగటి పూట వెలుతురు మరింతగా పెరుగుతుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో ఇలా (Telangana Weather Forecast)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Weather Updates) వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) February 26, 2022