Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్! హెచ్చరికలు ఉన్నాయా? అంచనా వేసిన IMD
Weather Updates: రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Weather Latest News: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇటు దక్షిణ కోస్తాలో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఏపీలో వచ్చే రెండు రోజులు వర్షాలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 20, 2022
Telangana Weather: తెలంగాణలో ఇలా
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో (జూలై 21, 22 తేదీలు) తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓమోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడింది. గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షం పడుతుందని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి హెచ్చరికలు లేవని అధికారులు అంచనా వేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో అత్యధికంగా 33.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
Also Read: Flood Effect: వరదలతో రూ.1400 కోట్లు నష్టం- ప్రాథమికంగా తేల్చిన తెలంగాణ ప్రభుత్వం
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu language Dated 20.07.2022. pic.twitter.com/9tpqjgPWSm
— MC Amaravati (@AmaravatiMc) July 20, 2022
Synoptic features of weather inference for Andhra Pradesh Dated 20.07.2022. pic.twitter.com/6wuDMlgVDE
— MC Amaravati (@AmaravatiMc) July 20, 2022