Weather Latest Update: ఈ జిల్లాల్లో నేడు వర్షాలు, ఇక్కడ భారీగా - కొన్ని చోట్ల వింత పరిస్థితి!
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Weather Latest News: జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Telangana Weather: తెలంగాణలో వాతావరణ స్థితి
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి బలపడింది. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Rains In Telangana: ఈ నెల 16 నుంచి తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు సహా నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్, జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (మార్చి 17) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. శనివారం (మార్చి 18) పెద్దపల్లి, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ములుగు, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వెదర్ బులెటిన్ లో తెలిపారు.
ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. 17, 18, 19 తేదీల్లో ప్రకాశం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Delhi Weather: ఢిల్లీలో ఇలా
రానున్న 5 రోజులపాటు భారత వాతావరణ విభాగం చెప్పిన అంచనాల ప్రకారం.. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చి 20 వరకు తేలికపాటి, మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండగా, వాయువ్య, తూర్పు, మధ్య, పశ్చిమ భారతదేశంలో మినహా గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన తేడా ఉండదు. మేఘావృతమైన వాతావరణం, వర్షం పడే అవకాశం ఉన్నందున ఢిల్లీ-NCR వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని భావిస్తున్నారు.