Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 4 రోజులు వానలే! నేడు ఈ జిల్లాల వారికి అలర్ట్
దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
Weather Latest News: ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కొనసాగనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఈ నెల 19 వరకూ ఏపీకి వర్ష సూచన ఉంది. నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పారు.
దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పారు. రాయలసీమలోనూ నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంటుంది.
7 days mid day forecast for Andhra Pradesh in Telugu Language dated-15.05.2022. pic.twitter.com/YKnnGS1lP0
— MC Amaravati (@AmaravatiMc) May 15, 2022
ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మే 16న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయని హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడా క్రమంగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరుగుతుందని అంచనా వేసింది.
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీల సెంటీ గ్రేడ్ నుంచి 24 డిగ్రీల సెంటీ గ్రేడ్ వరకూ ఉండే అవకాశం ఉంది. దక్షిణ నైరుతి దిశ ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది.’’ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.
‘‘భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 15, 2022