X

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దాని ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు. 

FOLLOW US: 

వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. జవాద్ తుపాను ఒడిశాలోని పూరీకి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, దాని ఫలితంగా ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు. 

జవాద్ తుఫాను అల్పపీడనంగా మారి బలహీనపడటంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, జవాద్ తుపాను బలహీనపడినా ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలో సైతం మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్టోగ్రత భారీగా పెరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లాలా వద్దా అనే విషయంపై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read: Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

తెలంగాణలో పొడి వాతావరణం.. 
నేడు, రేపు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా.. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్టంగా 14.2 డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెప్పారు. ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read: WhatsApp Update: వాట్సాప్ చాటింగ్ మెస్సేజ్‌లతో విసిగిపోయారా.. మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana rains hyderabad rains telangana rains rains in telangana Weather Updates weather news ap rains AP Latest news rains in ap ap weather updates telangana weather updates rains news Bay of bengal low pressure

సంబంధిత కథనాలు

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా  చేయాలట….