By: ABP Desam | Updated at : 26 Nov 2021 06:58 AM (IST)
ఏపీ, తెలంగాణలో వర్షాలు (Representational Image)
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరం దగ్గర్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా.. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి, నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల మేర నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం నవంబర్ 29న ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరికొన్ని గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్సాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: TTD: డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు జారీ.. ఎప్పుడంటే?
దక్షిణ కోస్తాంద్రలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం నాడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు.
రాయలసీమలో గత వారం కురిసిన భారీ వర్షాల నుంచి అనంతపురం, చిత్తూరు జిల్లా వాసులు ఇంకా తేరుకోలేదు. నెల్లూరులోనూ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. మరో మూడురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: CM Jagan: 10 లక్షల ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చాం.. గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
తెలంగాణలోనూ వర్షాలు..
తెలంగాణలో నిన్న కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. నేడు ఎలాంటి వర్ష సూచన కనిపించడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్రంలో ఒకట్రెండు ప్రాంతాల్లో మాత్రమే చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉక్కపోత కాస్త అధికమయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల తరువాత మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
Breaking News Live Updates : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్