అన్వేషించండి

Weather Updates: తెలుగు రాష్ట్రాలకు స్వల్ప ఊరట.. పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటో తెలుసా!

AP Temperature Today: ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి.

Telangana Temperature Today: చలిగాలుల కాస్త తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి గాలులు వీచడంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గాలులు వీస్తున్నప్పటికీ తాజాగా ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ దిశగా గాలులు వీచడం మొదలైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో అత్యల్పంగా 9.2 డిగ్రీలు, చింతపల్లిలో 13.9 డిగ్రీలు, జీకే వీడిలో 8.2 డిగ్రీలు, పెదబయలులో 8.3  డిగ్రీలు, మాడుగులలో 12.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల 6 కంటే తక్కువ దిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు తాజాగా 8 డిగ్రీలు పైగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని, ఉదయం వేళ వాహనాలు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు ప్రజలకు సూచించారు.

గత కొన్ని రోజులతో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. దక్షిణ కోస్తాంద్రలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో చలి తీవ్రత అదే విధంగా ఉంది.  విశాఖ అరకుకి పోటిగా చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హార్స్‌లీ హిల్స్ లో7.8 డిగ్రీలు నమోదయ్యింది. జిల్లాలోని అరోగ్యవరంలో 9.9 డిగ్రీలు, మదనపల్లెలో 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురం జిల్లా మడకశిరలో 9.9 డిగ్రీలు, కుందుర్పిలో 10.2 డిగ్రీలు, సోమండెపల్లెలో 11 డిగ్రీలు.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 11.7 డిగ్రీలు, హలహర్విలో 12.8 డిగ్రీలు.. కడప జిల్లాలో రాయచోటిలో 12.5 డిగ్రీలల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: ITR Filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్‌!!

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణంలో పెద్దగా మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు వాతావరణ పొడిగా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని చోట్ల ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 28, 29 తేదీలలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో చలి గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget